షూటింగ్‌లో ప్రమాదం: హీరో బాలకృష్ణ కాలికి గాయం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ కాలికి గాయాలయ్యాయి. షూటింగ్ ప్రమాదంలో శుక్రవారం ఆయన కాలికి గాయమైంది. హైదరాబాదులో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో గాయాలు కావడంతో బాలయ్యను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

బాలకృష్ణ నటిస్తున్న సినిమా పేరు తెలియనప్పటికీ... హైదరాబాదు పరిసరాల్లో బైక్ రేసింగ్ సన్నివేషంలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. బాలయ్య కాలికి మాత్రమే.. అదీ స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది.
కాగా, నందమూరి బాలకృష్ణ ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాల పైన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలకృష్ణ టీడీపీ తరఫున హిందూపురం శాసన సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుండి బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు నియోజకవర్గం పైన దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications