భయమెందుకు - మంత్రి రోజాకు మరో నటుడి జలక్ : మెగా బ్రదర్స్ కు మద్దతుగా..!!
మంత్రి రోజా వర్సస్ మెగా బద్రర్స్ మద్దతు దారుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. జబర్ధస్త్ ఫేం ఆది జనసేనాని పవన్ కు మద్దతుగా మాట్లాడే సమయంలో వేసిన పంచ్ లు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మంత్రులకు తమ శాఖల పైన అవగాహన లేదని విమర్శించారు. పవన్ కల్యాణ్‌ను తిట్టడం కోసం ఇక ప్రత్యేక శాఖను పెట్టుకోవాలంటూ మంత్రులకు చురకలంటించారు. దీనికి వైసీపీ నేతలు ఆది లక్ష్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ఇవే వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి రోజా స్పందించారు. ఇప్పుడు మంత్రి రోజాకు కౌంటర్ గా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ అటు సినీ..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.

మెగా బ్రదర్స్ పై మంత్రి రోజా వ్యాఖ్యలతో
ఇప్పుడు మంత్రి రోజా లక్ష్యంగా మెగా బ్రదర్స్ మద్దతు దారులుగా ఉన్న హీరోలు ఫైర్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్స్ సొంత ఊరిలోనే గెలవలేకపోయారంటూ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రోజా వ్యాఖ్యలను పలువురు తప్పు బట్టారు. జబర్దస్త్ శీను కూడా డైరెక్టుగా మెగా ఫ్యామిలీపై రోజా వ్యాఖ్యలను తప్పుబడుతూ..సామాజిక సేవ చేస్తున్న చిరంజీవిని ఉద్దేశించి రాజకీయాల కోసం అటువంటి వ్యాఖ్యలు చేయటం సరి కాదని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సభలో ఆది చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. వీటి పైన స్పందించిన రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వారితో ఎవరు మాట్లాడిస్తున్నారో చూడాలన్నారు.
ఆది - శీను కామెంట్స్ పై మంత్రి స్పందనతో
చిరంజీవి ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే.. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అని భయంతోనే చిన్న ఆర్టిస్ట్‌లు వాళ్లకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రేమతో మాత్రం కాదు. నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మా ఎన్నికలలో సపోర్ట్ చేసినప్పుడు.. ఆయన ప్రెసిడెంట్‌గా ఎందుకు గెలవలేదు. ఒక్కసారి ఆలోచించండి.. ప్రేమ వేరు.. భయం వేరు' అని రోజా చెప్పుకొచ్చారు. దీని ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలిచినా.. ప్రకాశ్ రాజ్ ఓడిపోయి.. మంచు విష్ణు గెలిచిన సందర్భాన్ని మంత్రి రోజా పరోక్షంగా గుర్తు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన హీరో బ్రహ్మాజీ స్పందించారు.భయమెందుకు.బ్రహ్మాజీ కౌంటర్
మంత్రి రోజాపై నాగబాబు కామెంట్స్.. దీనికి మంత్రి కౌంటర్, ఆ తరువాత పవన్ వ్యాఖ్యలు.. రోజా ప్రతిస్పందనతో ఈ వివాదం ముదిరింది. మంత్రి రోజా మెగా ఫ్యామిలీకి చిన్న ఆర్టిస్టులు భయపడి వారికి మద్దతుగా మాట్లాడున్నారనే కామెంట్స్ పైన నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేసారు. అందులో.. "నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు ..చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు .." అంటూ పోస్టు చేసారు. దీనికి మంత్రి రోజా మాట్లాడిన వ్యాఖ్యల వీడియోను జత చేసారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ట్వీట్ పైన మంత్రి రోజా ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. జనసేన వర్సస్ వైసీపీ మధ్య ముదురుతున్న పొలిటికల్ వార్ లో ఒకప్పటి జబర్దస్త్ జడ్జి వర్సస్ కంటెస్టెంట్స్ మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకీ మదురుతోంది.












Click it and Unblock the Notifications