Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2009లో టిడిపికి ప్రచారం, ప్రమాదం: భయపడనని.. జూ.ఎన్టీఆర్ వ్యాఖ్య

హైదరాబాద్: 'నాన్నకు ప్రేమతో' భారీ విజయంతో జోష్ మీదున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో జరిగిన ప్రమాదాన్ని ఆయన గుర్తుకు చేసుకొని మాట్లాడారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని, మృత్యువు తనదాకా వస్తే సంతోషంగా వెళ్తానని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రమాదం జరిగింది. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నాటి ప్రమాదం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు. జీవితాన్ని తాను చూసే కోణమే మారిపోయిందన్నారు.

Hero JR NTR on 2009 accident

అది తన రెండో జన్మగా భావిస్తానన్నారు. అందుకే తన భార్య లక్ష్మీప్రణతి పుట్టిన రోజు కూడా అయిన మార్చి 26న ఇంట్లో రెండు పుట్టిన రోజులు జరుపుకుంటామన్నారు. పుట్టిన ప్రతి మనిషి ఎపపుడైనా మరణానికి చేరువ కావాల్సిందేనని, ఆశ అనే చిన్న రేఖ పైన బతుకుతున్నామని, ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసునని, నా కోరిక ఒక్కటే చనిపోయే ముందు క్షణం కూడా గిల్టీగా ఫీలవకూడదన్నారు.

కాగా, 2009లో టిడిపి తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రచారం చేసి హైదరాబాద్ తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లా సూర్యాపేట వద్ద కారు బోల్తా పడి గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇదిలా ఉండగా, 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు.. ఆ పార్టీకి దూరం ఉన్నాడనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు, బాలయ్యలతో ఆయనకు పడటం లేదనే వాదనలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+