Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీరో మహేశ్ బాబుకు జగనన్న విద్యా దీవెన కార్డ్! కర్నూలులో డిగ్రీ చదువుతున్నారు!!

అమరావతి: ఓటర్ కార్డుల్లోనే కాదు.. ప్రభుత్వ పథకాల కోసం జారి చేసే కార్డుల్లోనూ తప్పులు దొర్లుతున్నాయనడానికి నిదర్శనంగా నిలిచారు కర్నూలు అధికారులు, సిబ్బంది. ఎందుకంటే.. ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జగనన్న విద్యా దీవెన పథకం కార్డు కార్డు జారీ చేయడం గమనార్హం. అది ఒక్కసారి కాదు, రెండుసార్లు మహేశ్ ఫొటోతో జారీ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది.

ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన..

ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన..

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా దీవెన అనే పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన విద్యార్థులకు కార్డులను అందజేశారు. కాగా, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ప్రభుత్వం ఏడాదికి రూ. 20వేలు అందిస్తోంది.

విద్యార్థినిక బదులు మహేశ్ బాబు..

విద్యార్థినిక బదులు మహేశ్ బాబు..

ఇంత వరకు బాగానే ఉన్నా.. కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన కార్డుపైకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫొటో రావడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో లక్ష్ి అనే విద్యార్థిని ఫొటోకు బదులు.. మహేశ్ బాబు ఫొటో ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో తన కార్డును చూసుకున్న విద్యార్థిని ఒక్కసారిగా షాకైంది. వెంటనే ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లింది.

మరో చోట విద్యార్థికి బదులు మహేశ్ బాబు..

మరో చోట విద్యార్థికి బదులు మహేశ్ బాబు..

ఇక మరో చోట కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. మహేశ్ అనే విద్యార్థి ఫొటో స్థానంలో సినీ హీరో మహేశ్ బాబు ఫొటో పెట్టారు సిబ్బంది. తన కార్డును పరిశీలించుకున్న ఆ విద్యార్థి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్డుల జారీలో ఇలా లోపాలు జరగడంపై ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అధికారులు కూడా తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు. విద్యార్థులు పొరపాటున ఫొటోలు మార్చి అప్‌లోడ్ చేశారా? లేక ప్రింటింగ్ సమయంలో ఎక్కడైనా పొరపాటు జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Recommended Video

    Katthi Mahesh Sensational Comments On YS Jagan's Amma Odi Scheme ! || Oneindia Telugu
    ఇటీవల ఓ ఓటర్ ఐడీ కార్డుపై వెంకటేశ్...

    ఇటీవల ఓ ఓటర్ ఐడీ కార్డుపై వెంకటేశ్...

    ఇది ఇలావుంటే, ఇటీవల కర్నూలు కార్పొరేషణ్ ఓటర్ల జాబితాలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ ఫొటో రావడం గమనార్హం. ఓ మహిళకు సంబంధించిన ఓటర్ కార్డులో వెంకటేశ్ ఫొటో వచ్చి చేరడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికారులు సవరణలు చేపట్టారు. ఈ ఘటన మర్చిపోకముందే కర్నూలులోనే మహేశ్ బాబు ఫొటో విద్యా దీవెన పథకం కార్డులో రావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+