అలా జరిగి ఉంటే బాగుండేది, అవసరమే: ప్రత్యేక హోదాపై హీరో నిఖిల్
ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని హీరో నిఖిల్ శనివారం నాడు అన్నారు. కుప్పంలోని ఐఆర్ఎం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని హీరో నిఖిల్ శనివారం నాడు అన్నారు. కుప్పంలోని ఐఆర్ఎం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
గణతంత్ర్య దినోత్సవం నాడు విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్కే బీచ్ వద్ద యువతకు నిరసనకు గంట అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తాను కేశవ సినిమా షూటింగులో బిజీగా ఉన్నానని, భవిష్యత్తులో నాగార్జున వంటి పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తుందని చెప్పారు.
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోసం పలువురు నటులు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ తదితరులు మద్దతు పలికారు. ఇప్పుడు హీరో నిఖిల్ కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పారు.












Click it and Unblock the Notifications