పవన్ కళ్యాణ్ జనసేనకు తెలంగాణ హీరో నితిన్?
హైదరాబాద్: సినిమా రంగంలో పాపులర్ హీరోల్లో నితిన్ ఒక్కడే తెలంగాణకు సంబంధించినవాడు. తెలంగాణ నుంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరోగా నితిన్ పట్ల తెలంగాణలో సానుకూల వైఖరి ఉంది. ఆ సానుకూల వైఖరిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీకి వాడుకుంటారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు నితిన్ అభిమాని.
పవన్ కళ్యాణ్‌ను నితిన్ పరోక్షంగా సమర్థిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం నితిన్ ప్రచారం చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రచారం చేయాల్సి వస్తే సినిమా కెరీర్‌కు ఇబ్బంది కలగకుండా ఎవరినీ విమర్సించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

పదేళ్ల పాటు సక్సెస్ లేక నితిన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రెండేళ్ల నుంచి మాత్రం నితిన్ సినిమాలు వరుసగా హిట్టవుతూ వస్తున్నాయి. ఈ హిట్స్‌కు కొంత పవన్ కళ్యాణ్ కారణమని కూడా నితిన్ భావిస్తూ ఉంటాడు. తాజాగా నితిన్ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. సురేందర్ రెడ్డి శిష్యుడితో ఆయన సినిమా చేస్తున్నాడు. కానీ ఈ చిత్రం ఆగిపోయిందని సమాచారం. ఆ తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ పట్ల తనకు గల అభిమానాన్ని నితిన్ ఎక్కడా దాచుకోలేదు. పైగా గుండె జారి గల్లంతయ్యిందే వంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లోని మాటలను సినిమా టైటిల్స్‌గా మార్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పాగా వేయడానికి కొంత మేరకు నితిన్ కూడా ఉపయోగపడుతాడనే భావనకు రావచ్చు.












Click it and Unblock the Notifications