గేమ్ ఛేంజర్- క్రేజీ కాంబో అదుర్స్, ఆ లెక్కే వేరు..!!
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని(MS Dhoni)ని కలుసుకున్నాడు. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించిన రామ్‌చరణ్.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇదే సమయంలో ధోనీని రామ్ చరణ్ కలుసుకున్న ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ గా మారింది.
హీరో రాం చరణ్ ప్రతీ ఏటా తరహాలోనే ఈ ఏడాది అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. ఉదయం ముంబాయిలోని ఆలయంలో రాం చరణ్ పూజల ఫొటోలు..వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో రాం చరణ్ లేటెస్ట్ ఫొటో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ ఫొటోలలో ధోనీ(MS Dhoni).. కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. చాలా స్టయిలిస్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త తరహా హెయిర్ స్టయిల్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో టార్జన్ తరహా హెయిర్ స్టయిల్‌తో కిక్ ఇచ్చిన ధోనీ, మళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో దర్శనమిచ్చాడు. యాడ్ షూట్ కోసం ధోనీ తన తల వెంట్రుకల్ని పెంచేశాడు.

తాజాగా ధోనీ క్రేజీ లుక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇప్పుడు ఇదే లుక్ లో ఉన్న ధోనిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు కలిసిన పిక్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చరణ్, ధోని లు గత 2010 సంవత్సరంలో కలిసి ఓ యాడ్ ని చేశారు. మరి మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మెగా ఫోర్సెస్ కలవడంతో ఫ్యాన్స్ అంతా ఈ పిక్ ను భారీగా సర్క్యులేట్ చేస్తున్నారు. వీరిద్దరూ.. ఒక యాడ్ షూట్ కోసం కలుసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications