‘అడగట్లేదు.. అడుక్కోవట్లేదు’: హోదాకు హీరో రామ్ మద్దతు
యంగ్ హీరో రామ్ చేరాడు. గురువారం సాయంత్రం విశాఖలో జరుగనున్న మౌన పోరాటానికి తన మద్ధతును తెలియజేశారు.
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి మరో సినీ హీరో మద్దతు తెలిపారు. ఇప్పటికే పవర్‌స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో పాటు ఇతర సినీ హీరోలు స్పెషల్ స్టేటస్ కోసం జరుగనున్న నిరసనకు తమ మద్ధతును తెలియజేశారు.
ఈ జాబితాలోకి తాజాగా యంగ్ హీరో రామ్ చేరాడు. గురువారం సాయంత్రం విశాఖలో జరుగనున్న మౌన పోరాటానికి తన మద్ధతును తెలియజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు.
Dear Brothers & Sisters..ADAGATLEDHU..ADUKOVATLEDHU...EDHURUCHUSTUNAAM..Less NOISE = More SOUND !! #silentprotest #APDemandsSpecialStatus pic.twitter.com/xs9BI1DmO7
— Ram Pothineni (@ramsayz) January 25, 2017
'డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.. అడగట్లేదు.. అడుక్కోవట్లేదు.. ఎదురుచూస్తున్నాం.. లెస్ నాయిస్=మోర్ సౌండ్' అని హీరో రామ్ ట్వీట్ చేశాడు. కాగా, ఇప్పటికే సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్, మనోజ్, రాజమౌళి, శివాజీ వంటి సినీ ప్రముఖులు ప్రత్యేక హోదా నిరసనకు మద్ధతు పలికిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications