విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాట తప్పని హీరో: ఏపీకి హోదా కోసం విశాఖకు సంపూర్ణేష్ బాబు, అరెస్ట్(వీడియో)

తాను చెప్పినట్లుగానే విశాఖ చేరుకుని హోదా కోసం పోరాటం చేస్తున్న యువతను కలిశారు సంపూర్ణేష్ బాబు. వారికి సంఘీభావం తెలియజేశారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం ఆర్కే బీచ్ కేంద్రంగా సాగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు ప్రముఖ సినీ హీరో సంపూర్ణేష్ బాబు గురువారం నగరానికి చేరుకున్నారు. సంపూర్ణేష్ బాబు ఇప్పటికే హోదా ఉద్యమానికి తన మద్దతును తెలియజేసిన విషయం తెలిసిందే.

Hero Sampoornesh babu reaches Visakha

హోదా ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించిన సంపూర్ణేష్‌ బాబు.. ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు గురువారం విశాఖ వస్తానని ప్రకటించారు కూడా. ఆర్కే బీచ్‌లో నిర్వహించే ప్రత్యేక హోదా నిరసనలో తాను పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. తాను చెప్పినట్లుగానే విశాఖ చేరుకుని హోదా కోసం పోరాటం చేస్తున్న యువతను కలిశారు సంపూర్ణేష్ బాబు. వారికి సంఘీభావం తెలియజేశారు.

Hero Sampoornesh babu reaches Visakha

కాగా, ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు సృష్టించినా.. వాటన్నింటినీ ఛేదించుకొని పెద్ద ఎత్తున యువత, వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు విశాఖపట్నం చేరుకుంటున్నాయి. ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న మౌనపోరాట దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన యువతను, ప్రజలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన యువతను, విద్యార్థులను పోలీసులు చెదరగొడుతున్నారు. శాంతియుతంగా, సయమనంగా మౌనదీక్షలో పాల్గొంటున్న విద్యార్థులను అరెస్ట్ చేయడంపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పలుచోట్ల విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేశారు పోలీసులు.

Hero Sampoornesh babu reaches Visakha

తమ్మారెడ్డి, సంపూర్ణేష్ బాబు అరెస్ట్

ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన హీరో సంపూర్ణేష్ బాబును పార్క్ హోటల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, మహేష్ కత్తి, తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచే వారిని తిరిగి పంపేందుకు యత్నిస్తున్నారు పోలీసులు.

English summary
Tollywood Hero Sampoornesh Babu has reached Visakhapatnam on Thursday to support special status protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X