హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్ (ఫోటోలు)
హైదరాబాద్: 'వైద్యం చాలా పవిత్రమైనది'. అందుకే వైద్య వృత్తిలో ఉండి, ప్రాణం పోసే డాక్టర్లను దేవుడితో సమానంగా భావిస్తారు. కొంతమంది వైద్యులు కేవలం తమ ఆస్పత్రికి వచ్చేవారికి చికిత్స చేయడంతో పాటు విడిగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అలాంటి వైద్యులు అరుదుగా ఉంటారు.
వాళ్లల్లో డాక్టర్ సీహెచ్ ఉమేష్ చంద్ర ఒకరు. నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో కన్సల్టంట్ డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టక్ ఉమేష్ చంద్ర గారు చేస్తున్న 'ఉచిత సేవ' గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ప్రతి నెలా రెండో ఆదివారం 150 నుంచి 200 మందికి ఉచితంగా సేవలందిస్తున్నారు.
గుండెకి సంబంధించిన వ్యాధులకు పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు చేసి, ఎనిమిది రోజులకు సరిపడా ఉచితంగా మందులు కూడా ఇస్తుంటారు. హైదరాబాద్ లోని అబిడ్స్‌లో గల బొగ్గులకుంటలోని 'ఉమా హార్ట్ కేర్ క్లినిక్'లో ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది.
2000వ సంవత్సరంలో ఆయన ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల రెండో వారానికి సంబంధించిన ఈ సేవా కార్యక్రమం ఆదివారం నాడు శ్రీకాంత్ చేతుల మీదగా ఆరంభమైంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ''ఈరోజు ఈ క్యాంపెయిన్ నా చేతుల మీదగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఉమేష్ చంద్ర చేస్తున్న ఈ సేవా కార్యక్రమం కొనియాడదగ్గది'' అని అన్నారు.
ఇక డాక్టర్ ఉమేష్ చంద్ర మాట్లాడుతూ ''ఇప్పటివరకు 184 నెలలు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్నికొనసాగిస్తూ వచ్చాం. ముందు ముందు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. నాకెంతో ఆత్మసంతృప్తిని మిగులుస్తున్న కార్యక్రమం ఇది'' అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శ్రీమిత్ర చౌదరి, ఫిజియోథెరపిస్ట్ దినకర్, నటులు చంటి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్ SIV_5776.JPG
'వైద్యం చాలా పవిత్రమైనది'. అందుకే వైద్య వృత్తిలో ఉండి, ప్రాణం పోసే డాక్టర్లను దేవుడితో సమానంగా భావిస్తారు. కొంతమంది వైద్యులు కేవలం తమ ఆస్పత్రికి వచ్చేవారికి చికిత్స చేయడంతో పాటు విడిగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అలాంటి వైద్యులు అరుదుగా ఉంటారు.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్ SIV_5821.JPG
వాళ్లల్లో డాక్టర్ సీహెచ్ ఉమేష్ చంద్ర ఒకరు. నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో కన్సల్టంట్ డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టక్ ఉమేష్ చంద్ర గారు చేస్తున్న 'ఉచిత సేవ' గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ప్రతి నెలా రెండో ఆదివారం 150 నుంచి 200 మందికి ఉచితంగా సేవలందిస్తున్నారు.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్
గుండెకి సంబంధించిన వ్యాధులకు పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు చేసి, ఎనిమిది రోజులకు సరిపడా ఉచితంగా మందులు కూడా ఇస్తుంటారు. హైదరాబాద్ లోని అబిడ్స్‌లో గల బొగ్గులకుంటలోని 'ఉమా హార్ట్ కేర్ క్లినిక్'లో ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్
2000వ సంవత్సరంలో ఆయన ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల రెండో వారానికి సంబంధించిన ఈ సేవా కార్యక్రమం ఆదివారం నాడు శ్రీకాంత్ చేతుల మీదగా ఆరంభమైంది.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ''ఈరోజు ఈ క్యాంపెయిన్ నా చేతుల మీదగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఉమేష్ చంద్ర చేస్తున్న ఈ సేవా కార్యక్రమం కొనియాడదగ్గది'' అని అన్నారు.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్
ఇక డాక్టర్ ఉమేష్ చంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకు 184 నెలలు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్నికొనసాగిస్తూ వచ్చామని చెప్పుకొచ్చారు.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్
ముందు ముందు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. నాకెంతో ఆత్మసంతృప్తిని మిగులుస్తున్న కార్యక్రమమని అని చెప్పారు.

హీరో శ్రీకాంత్ చేతుల మీదగా ఉమేష్ చంద్ర హార్ట్ క్యాంప్
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శ్రీమిత్ర చౌదరి, ఫిజియోథెరపిస్ట్ దినకర్, నటులు చంటి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications