మెగావారి ఇంట పెళ్లి బాజాలు
మెగావారి ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. వరుణ్ తేజ్ (varun tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (lavanya tripathi) నిశ్చితార్థంహైదరాబాద్‌లో జూన్ 9న జరగనుంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ప్రతినిధి ట్వీట్‌ద్వారా తెలియజేశారు. నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులతోపాటు కొంతమంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.
ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది. 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొగ్గతొడిగింది. ఫిల్మ్ నగర్ లో అప్పటి నుంచి వీరిద్దరి వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటి కాబోతున్నారు. నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా వారి కుటుంబాల నుంచి ప్రకటన రాకపోవడంతో అభిమానులు కన్ఫ్యూజన్ కు గురయ్యారు. ఇటీవలే వరుణ్ తండ్రి నాగబాబు మీడియాతో మాట్లాడుతూ కొడుకు పెళ్లి విషయం తనే చెబుతాడని, మంచి సందర్భం చూసి ప్రకటిస్తారన్నారు. దీంతో అభిమానులంతా వరుణ్ తేజ్ - లావణ్య వివాహం చేసుకోబోతున్నారంటూ పోస్టులు పెట్టారు.
తన బాబాయి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేస్తుండటంతో తాము కూడా ఎన్నికల ప్రచారానికి రాబోతున్నట్లు వరుణ్ తేజ్, రామ్ చరణ్ గతంలోనే ప్రకటించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతోపాటు అభిమానులను కార్యకర్తలుగా మార్చుకొని సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలనే పట్టుదలతో పవన్ కల్యాణ్ ఉన్నారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి చిరంజీవి కుటుంబంతోపాటు పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications