మా బావకే మీ ఓటు: హీరో వేణు, నామాకు ప్రచారం

హైదరాబాద్/ఖమ్మ: ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభిమాన నేతలు, బంధువుల కోసం మద్దతు తెలుపుతున్న సినీ తారల జాబితాలో మరొకరు చేరారు. దేశంతోపాటు రాష్ట్రంలో ఈ తరహా ప్రచారం కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్ హీరో వేణు తన బావ, ఖమ్మం లోకసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావును గెలిపించాలని కోరుతున్నారు.

Hero Venu compaigns for Nama Nageswara Rao

అంతేగాక నామా నాగేశ్వర్ రావు తరపున వేణు ప్రచారం చేస్తున్నారు. తన బావకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. స్వయంవరం, చిరునవ్వుతో తదితర సినిమాల్లో నటించిన వేణు వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన బావ నామా నాగేశ్వర్ రావు గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.

నామ నాగేశ్వర్ రావుకే ఓటు వేసి గెలిపించాలని వేణు కోరుతున్నారు. కాగా, ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన బావ, తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌కు మద్దతుగా ట్టిట్టర్ ద్వారా సందేశాలు పంపిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున కూడా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+