పవన్ అంటే ఇష్టమే .. కానీ జగనే సీఎం అవుతారు - స్టార్ హీరో
ఏపీలో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపుపై రాజకీయ పార్టీలన్నీ కూడా ధీమా వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఓ ప్రముఖ వార్త ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఏపీ రాజకీయాల గురించి తనదైనశైలిలో మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలంటే కచ్చింతంగా అధికారంలో ఉండాల్సిందే అని ఆయన తెలిపారు.
నేను ఎప్పుడు వైసీపీకి మద్దతిస్తున్నట్టు తెలపలేదని విశాల్ క్లారిటీ ఇచ్చారు. నాకు జగన్ మాత్రమే ఇష్టమని ఆయన తెలిపారు. నేను జగన్‌ను మాత్రమే ఇష్టపడతానని, ఆ పార్టీకి నేను ఎప్పుడు కూడా మద్దతు ప్రకటించలేదని విశాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా ఆయన స్పందించారు. పవన్ చాలా మంచి వ్యక్తి అని... కోట్ల రూపాయిల రెమ్యూనిరేషన్‌ను వదిలిపెట్టి ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని విశాల్ పేర్కొన్నారు.

పవన్ అంటే ఇష్టమే కానీ ఏపీకి జగనే సీఎం అవుతారని..కావాలని కూడా నేను కోరుకుంటున్నానని ఈ తమిళ హీరో పేర్కొన్నారు. జగన్ అమలు చేసిన మంచి పనులే ఆయన్ను తిరిగి సీఎంగా నిలబెట్టేలా చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి గురించి కూడా విశాల్ స్పందించారు. జగన్ తండ్రి వైఎస్ఆర్ చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన్ను చూస్తున్నామని...జగన్ ఇలాంటి వాటికి భయపడరని విశాల్ వ్యాఖ్యానించారు.
ఈ ఘటన వెనుక రాజకీయ కారణాలు గురించి నేను మాట్లాడను కానీ..దీని వెనుక వేరే కారణాలు కూడా ఉండవచ్చని విశాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు జగన్‌ను ఏం చేయలేవని..ఆయన ఇలాంటివి చాలానే చూశారని చెప్పారు.జగన్ రాయలసీమలో పుట్టారని ఇలాంటి వాటికి ఆయన బెదిరిపోరని విశాల్ చెప్పుకొచ్చారు. విశాల్ ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications