అనుష్కవల్ల సమంతకు రూ.10 కోట్ల నష్టం?
సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతమైన వైరల్ గా మారింది. అనుష్కవల్ల సమంతకు రూ.10 కోట్ల నష్టం వచ్చిందంట. ప్రస్తుతం అనుష్క బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని టాక్ వస్తోంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా కరణ్ జోహార్ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా పంజాను తీసిన విష్ణువర్ధన్ దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా కోసం దక్షిణాది హీరోయిన్ ను తీసుకోవాలని దర్శకుడు భావించారు.
సమంత, అనుష్క శెట్టి, త్రిష, నయనతార, రష్మిక... ఇలా పలు పేర్లు తెరపైకి వచ్చాయి. పుష్ప చిత్రంలో ప్రత్యేక గీతంతోపాటు ది ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తో ఉత్తరాది ప్రేక్షకులకు కూడా సమంత చేరువైంది. వరుణ్ ధావన్ జోడీగా యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలోనే ఇది ప్రసారమవబోతోంది. సమంతను తీసుకుందామని దర్శకుడు భావించారు. అయితే రంగంలోకి దిగిన సల్మాన్.. సమంత వద్దు, అనుష్కను తీసుకుందామంటూ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ పక్కన సమంత కంటే అనుష్క చాలా బాగా సూట్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తో అనుష్క నటన నార్త్ ప్రేక్షకులకు సైతం ఎంతగానో ఆకట్టుకుంది. కండల వీరుడికి జోడీగా అనుష్కే బాగుంటుందూ ఎక్కువ శాతం నెటిజన్లు నుష్కకే ఓటేసారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో చిత్ర యూనిట్ కూడా అనుష్కవైపే మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లోకి సమంత అడుగుపెట్టివుంటే ఈ సినిమా రెమ్యునరేషన్ ద్వారా రూ.10 కోట్లు వచ్చేవని, కానీ అనుష్కవైపు చిత్ర యూనిట్ మొగ్గుచూపడంతో సమంత రూ.10 కోట్లు నష్టపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications