ఈ సెషన్స్‌లోనే టి చట్టం: కిరణ్‌కు తేల్చిచెప్పిన అధిష్టానం
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు చట్టం అవుతుందని, విభజనపై నిర్ణయం జరిగిపోయిందని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. వార్‌రూమ్‌లో శుక్రవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నేతలకు ఈ విషయం స్పష్టం చేశారట.
సమాచారం మేరకు.. విభజనపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, ఎప్పుడు ఏ నిర్ణయం అమలు కావాలన్నది నిర్దేశితమైపోయిందని, ఈ నెల 18న కేంద్ర మంత్రులతో జివోఎం సమావేశమవుతుందని, ఆ తర్వాత బిల్లు రూపకల్పన జరుగుతుందని, 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలోనే బిల్లును ఆమోదిస్తారని తెలిపారు.

నెలాఖరులోపు బిల్లును అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి పంపాలని, శీతాకాల సమావేశాల్లో బిల్లు చట్టం అయి తీరుతుందని కిరణ్ సహా రాష్ట్ర నేతలకు దిగ్విజయ్ స్పష్టం చేశారట. సమావేశంలో ముందుగా షెడ్యూలును చెప్పిన తర్వాతే ఆయన ఆంటోనీ కమిటీ ప్రతిపాదనలపై చర్చించినట్లు సమాచారం. అయితే, దిగ్విజయ్ సింగ్ షెడ్యూలును వివరించినప్పుడు ముఖ్యమంత్రి సహా నేతలు ఎవరూ మాట్లాడలేదని తెలిసింది.
కాగా సమావేశంలో చర్చించిన ఆంటోనీ కమిటీ ముసాయిదా ప్రకారం.. జిహెచ్ఎంసి పరిధినే ఉమ్మడి రాజధానిగా పరిగణించాలని, హైదరాబాద్ ఆదాయాన్ని పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కూడా మూడు పేజీల నివేదికలో ఆంటోనీ కమిటీ సూచించింది. ఇందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. విశాఖపట్నం, కొత్త రాజధాని సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికగా పంచాలని తెలిపింది.












Click it and Unblock the Notifications