నారా లోకేశ్ బెయిల్ పిటీషన్ డిస్పోజ్ - అరెస్ట్ పై సీఐడీ ఏం చెప్పింది..!!

టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్ బెయిల్ పిటీషన్లపై హైకోర్టులో వరుస నిర్ణయాలు వెలువడ్డాయి. స్కిల్ స్కాంలో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ లోకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన విచారణ తరువాత హైకోర్టు ఈ పిటీషన్ ను డిస్పోజ్ చేసింది.

స్కిల్ కేసులో లోకేశ్:స్కిల్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. స్కిల్ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని..అందువల్ల ఆయననున అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు. ఒక వేళ కేసులో లోకేష్ పేరును చేర్చితే 41ఏ నింధనలు అనుసరిస్తాయని చెప్పారు. దీంతో లోకేశ్ పిటీషన్ ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. ఈ పిటీషన్ పైన ఈ నెల 4న విచారణ జరిగింది. ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.

High Court disposed Nara Lokesh Bail petition in Skill Scam, CID ready to issue 41A notices

చంద్రబాబు బెయిల్ పిటీషన్:ఇవాళ మరోసారి కోర్టు విచారణ చేసింది. సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు కుటంబ సభ్యుల లబ్ది పొందినట్లు పేర్కొన్నారని లోకేశ్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలోనే పిటీషనర్ ను అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉన్నందునే ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం లోకేశ్ పిటీషన్ ను డిస్పోజ్ చేసింది.

మరో వైపు అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు లో విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.

High Court disposed Nara Lokesh Bail petition in Skill Scam, CID ready to issue 41A notices

తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు:ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అంగళ్లు మీదుగా వెళ్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో చంద్రబాబు సహా 179 యంది నేతల పై కురబల కోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేసారు. అందులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటుగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

దీని పైన టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. విచారణ తరువాత కొందరికి బెయిల్ లభించింది. ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలైంది. దీంతో..హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగ్గా తాజాగా తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+