కస్టడీలోనూ పీఎస్సార్ అదే బాసిజం - బెయిల్, షరతులు...!!

పీఎస్సార్‌ ఆంజనేయులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం పలు కేసుల్లో విచారణ ఎదుర్కొం టున్నారు. రిమాండ్ లో ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఏపీపీఎస్సీ కేసు విచారణ చేస్తు న్నారు. అయినా..పీఎస్సార్ లో దర్పం తగ్గలేదు. విచారణ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేయ టం సంచలనంగా మారుతోంది. కస్టడీలో పోలీసు అధికారుల పై ఒక ఐపీఎస్ తరహాలో వ్యవహరిం చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జెత్వానీ కేసులో హైకోర్టు పీఎస్సార్ కు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

పోలీసు కస్టడీలో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు వ్యవహార శైలి పైన మరో సారి చర్చ సాగుతోంది.
విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన్ను కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది.25వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆయన సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నారు. పీఎస్ఆర్‌తో పాటు కామ్‌సైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ కూడా స్టేషన్‌లోనే ఉన్నారు. నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్‌ వీరిద్దరినీ వేర్వేరుగా విచారణ చేసారు. తొలిరోజు విచారణలో భాగంగా మధ్యలో టాయిలెట్ కు వెళ్లి వచ్చిన పీఎస్సార్ నేరుగా ఏడీసీపీ చాంబర్‌కు వెళ్లారు. ఆ చాంబర్‌లో ఇద్దరు ఏసీపీలు కూర్చు న్నారు. ఆయనను చూడ గానే ఇద్దరు ఏసీపీల్లో ఒకరు బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.

high-court-grants-bail-for-psr-anjaneyulu-in-jetwani-case-with-conditions

దీంతో, తనను చూసి నిలబడిన మరో ఏసీపీని పీఎస్సార్ ప్రశ్నలు వేశారు. తన కేసు (ఏపీపీఎస్సీ)ను మీరే దర్యాప్తు చేస్తున్నారా? మీరు ఎక్కడి ఏసీపీ అంటూ ప్రశ్నలు సంధించారు. కేసుతో సంబంధం లేనప్పుడు ఇక్కడెందుకున్నారన్న అర్థం వచ్చేలా పీఎస్ఆర్‌ మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. తాను అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పడంతో సరేనంటూ వెళ్లిపోయారు. పీఎస్సార్ ఏడీ సీపీ చాంబర్‌లోకి వెళ్లి ఏసీపీని ప్రశ్నించడం పైన చర్చ సాగుతోంది.

ఇక, ముంబయి సినీ నటిపై వేధింపులకు పాల్పడిన కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు బెయిల్‌ మంజూరైంది. ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి జెత్వానీపై తప్పుడు కేసు పెట్టించి, అక్రమంగా అరెస్ట్‌ చేసి వేధింపులకు గురిచేసిన కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఏ2గా ఉన్నారు. పీఎస్​ఆర్​ను సీఐడీ పోలీసులు గత నెలలో అరెస్టు చేసి విచారణ జరిపారు. బెయిల్‌ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్ తామని హైకోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి సవివర ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+