చంద్రబాబుకు మరో షాక్‌ - అమరావతి కేసు రీ ఓపెన్..!!

టీడీపీ అధినేత చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు 36 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇదే సమయంలో అంగళ్లు..అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్.. ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు పైన కేసులు నమోదయ్యాయి. ఇక, తాజాగా అమరావతి అసైన్డ్ భూముల అవకతవకలకు సంబంధించి కేసు రీ ఓపెన్ చేసేందుకు సీఐడీ కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీని పైన కోర్టు నోటీసులు జారీ చేసింది.

వెంటాడుతున్న కేసులు:చంద్రబాబు కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వరుస కేసులు టీడీపీ అధినేతకు సమస్యగా మారుతున్నాయి. 36 రోజులుగా స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు..బెయిల్ పిటీషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది. అదే విధంగా క్వాష్ కేసులోనూ సుప్రీంలో రేపు (మంగళవారం) విచారణకు రానుంది. ఇటు ఏపీ హైకోర్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2021లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గోల్ మాల్ జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి ఫిర్యాదు చేసారు. దీని పైన సీఐడీ విచారణ పూర్తి చేసింది. ఈ కేసు లో మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. విచారణ చేసిన న్యాయస్థానం నేడు తీర్పు ఇచ్చేందుకు సిద్దమైంది.

High Court posted Amravati Asigned lands case Re open petitions hearing for Novermber 1st

అమరావతి కేసు రీ ఓపెన్:ఇదే సమయంలో సీఐడీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆధారాలు అందాయని చెబుతూ..ఈ కేసు విచారణకు వీలుగా రీ ఓపెన్ కు న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేసింది. కొత్త ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్‌ లో సీఐడీ కోరింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ కోర్టుకు ఆడియో ఆధారాలు అందచేసింది. రేపు వీడియోలను అందిస్తామని వెల్లడించిది.

కొత్త ఆధారాల నేపథ్యంలో కేసును రీ ఓపెన్‌ చేయాలని సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్లను కోర్టు విచారించింది. కేసు రీ ఓపెన్‌ చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం...విచారణ నవంబర్‌ 1వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

High Court posted Amravati Asigned lands case Re open petitions hearing for Novermber 1st

ఆధారాలతో ముందుకు:మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన ఆధారాల పైన తాజాగా ఆయన మరదలు కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నారాయణ అక్రమాల పై పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఎటువంటి ఆధారాలు కృష్ణప్రియ వద్ద ఉన్నాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

అసైన్డ్ భూముల వ్యవహారంలో నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మకాలు..లావాదేవీలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నాడు మున్సిపల్ మంత్రిగా నారాయణ కీలక పాత్ర పోషించారనేది అభియోగం. దీంతో ఈ కేసు తిరిగి విచారణ విషయంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది...సీఐడీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+