సీఎం జగన్ బెయిల్ రద్దుపై రఘురామ పిటీషన్ తిరస్కరణ - అసలు కారణం ఏంటంటే..!!
ముఖ్యమంత్రి జగన్..ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతే ఎంపీ రఘురామ రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఈ అంశం పైన దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. వీరిద్దరి బెయిల్ ను రద్దు చేయాలని గతంలోనే రఘురామ రాజు సీబీఐ కోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. దీని పైన సుదీర్ఘ వాదనలు సాగాయి. కీలక హోదాలో ఉన్న ఇద్దరూ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారంటూ రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

సీబీఐ కోర్టు తీర్పు పైన అప్పీల్
దీనికి కౌంటర్ గా సీఎం జగన్..ఎంపీ సాయిరెడ్డి తరపు న్యాయవాదులు సైతం రాజకీయ దురుద్దేశంలో భాగంగానే తమ బెయిల్ రద్దు పిటీషన్లు దాఖలు చేసారంటూ తమ వాదనలు వినిపించారు. తొలుత సీఎం జగన్ పైన దాఖలు చేసిన పిటీషన్ విచారించిన సీబీఐ కోర్టు..తరువాత విజయ సాయిరెడ్డి పైన దాఖలైన పిటీషన్ ను విచారించింది. రెండు పిటీషన్లలోని అంశాలు ఒకే విధంగా ఉండటంతో కలిసి తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. విచారణ పూర్తయి..తీర్పు వెలువడే రోజు రఘురామ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

హైకోర్టులో రఘురామ పిటీషన్
తాను దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్లను మరో బెంచ్ కు మార్చాలని కోరారు. దీని పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామ దాఖలు చేసిన పిటీషన్ తోసిపుచ్చింది .దీంతో.. సీబీఐ కోర్టు రఘురామ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ల పైన తీర్పు వెలువరించింది. సీఎం జగన్ ..విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్లను తోసిపుచ్చింది. ఇక, దాంతో తాను దీని పైన హైకోర్టుకు వెళ్తానంటూ అప్పట్లోనే రఘురామ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు హైకోర్టులో ఈ మేర పిటీషన్లు దాఖలు చేసారు. అందులో సీఎం జగన్ తో పాటుగా విజయ సాయిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.

ఆ ఇద్దరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ
సీబీఐ కోర్టు తమ వాదనలను సరిగా వినలేదంటూ తన పిటీషన్ లో పేర్కొన్నారు. వీరిద్దరూ అధికారంలో ఉండి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని తన పిటీషన్ లో వివరించారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఉన్నవారికి పదవులు కట్టబెడుతున్నారంటూ పేర్కొన్నారు. సీఎం జగన్.. ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ కండీషన్లను ఉల్లంఘిస్తున్నా..సీబీఐ ఎలాంటి అభ్యంతరాలు చెప్పటం లేదని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలతో దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.

తిరస్కరించిన రిజిస్ట్రీ
సాంకేతిక కారణాలు..పూర్తి వివరాలు లేని కారణంగానే పిటీషన్ ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. రిజిస్ట్రీ లేవెనెత్తిన అభ్యంతరాలను సరి చేసి రఘురామ రాజు మరలా పిటీషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలను పరిష్కరిస్తూ..మరలా పిటీషన్లను దాఖలు చేస్తే వాటికి నెంబరింగ్ జరగుతుందని చెబుతున్నారు. దీంతో..రఘురామ రాజు తిరిగి మరో సారి వీటిని హైకోర్టులో దాఖలు చేయటానికి సిద్దం అవుతున్నారు. విజయ సాయిరెడ్డి తాను సీబీఐ కోర్టు తీర్పు పైన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన అంశాన్ని స్వయంగా చెప్పుకొచ్చారు.
Recommended Video

హైకోర్టులో మరోసారి దాఖలుకు నిర్ణయం
ఇక, ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వంలోని నిర్ణయాలు...ప్రభుత్వం పైన ఎంపీ రఘురామ రాజు స్పందిస్తూనే ఉన్నారు. కానీ, గతంలో లాగా వైసీపీ నేతలు మాత్రం రఘురామ రాజు వ్యాఖ్యల మీద ఎక్కడా స్పందించటం లేదు. దీంతో, ఇప్పుడు హైకోర్టులో తిరిగి రఘురామ రాజు పిటీషన్లు దాఖలు చేస్తే...ఆ కేసు పైన మరోసారి రాజకీయంగా ఆసక్తి మొదలు కానుంది.












Click it and Unblock the Notifications