సిఆర్‌డిఎపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీఆర్‌డీఏపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాతే విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే సీఆర్‌డీఏ బిల్లు చట్ట వ్యతిరేకం అంటూ హైకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు ఒక పత్రికా ప్రతినిధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి సంబంధించి గతంలో రెండు సార్లు విచారణకు వచ్చినప్పటికీ హైకోర్టు వాయిదా వేస్తూ వచ్చింది. సీఆర్‌డీఏపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు వాదించారు. అయితే సీఆర్‌డీఏపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు వేసవి సెలవుల తర్వాతే విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.

శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శేషాచలం ఎన్‌కౌంటర్‌పై కేసు విచారణ బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఆరుగురు స్మగ్లర్ల ఫస్ట్ పోస్టుమార్టం రిపోర్టును ఏపీ ప్రభుత్వం కోర్టుకు అందజేసింది. బుధవారం విచారణ సమాయానికి రీ-పోస్టుమార్టం రిపోర్టును అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
జిహెచ్ఎంసీ ఎన్నికలపై విచారణ వాయిదా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారం నాటికి వాయిదా వేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని న్యాయస్థానం గతంలో తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించిన విషయం తెలిసిందే. వార్డుల విభజన పూర్తి చేసే వరకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications