టీడీపీ భారీ ఆశలు అక్కడే.. కానీ - వైసీపీ బిగ్ ట్విస్ట్, అదే జరిగితే..!!

ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ సరళి పైన తుది అంచనాల్లో ఉన్నాయి. నేడు వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్ తో తమ అంచనాలు ఎంత వరకు దగ్గరగా ఉంటాయానే లెక్కలు వేస్తున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పై టీడీపీ భారీ ఆశలు పెట్టుకుంది. వైసీపీ వాదన భిన్నంగా ఉంది. దీంతో, హైకోర్టులో నేడు కీలక తీర్పు వెల్లడి కానుంది.

టీడీపీ అంచనాలు
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ తమకే అనుకూలంగా ఉంటుందని టీడీపీ కూటమి ఆశిస్తోంది. కానీ, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఓటరు డిక్లరేషన్‌కు చెందిన ఫామ్‌-13ఏ'పై అటెస్టింగ్‌ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా అనుమతించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో వైసిపి సవాల్‌ చేసింది.

High court to give verdict over Postal ballot controversy in ap ahead counting

దీనిని శుక్రవారం హెకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కిరణ్మయి ప్రతాప, జస్టిస్‌ న్యాపతి విజరులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది.

కోర్టులో వాదనలు
ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలని, పేరు, హోదా, సీలు లేకపోయినా పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ మే 30న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అత్యవసర పిటిషన్‌ దాఖలు లచేశారు.

ఆయన తరపున సీనియర్‌ అడ్వకేట్స్‌ అభిషేక్‌ సింఘ్వీ (సుప్రీంకోర్టు), పి వీరారెడ్డి వాదిస్తూ, ఎపిలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్‌ బ్యాలెట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయని, వీటికి సంబంధించిన మార్గదర్శకాల మార్పును రద్దు చేయాలని కోరారు. ఎపిలో మాత్రమే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో చెల్లని ఓట్లను లెక్కింపులో పరిగణనలోకి తీసుకునేలా ఇసి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

High court to give verdict over Postal ballot controversy in ap ahead counting

తీర్పు పై ఉత్కంఠ
అటెస్టింగ్‌ అధికారి సంతకం సరిపోతుందన్న ఇసి నిర్ణయాన్ని కొట్టేయాలని కోరారు. ఇసి తరపున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశారు ప్రతివాదన చేస్తూ, ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేసిన ఉద్యోగులకు మాత్రమే 30న జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయన్నారు.

ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగ హక్కు గతేడాది ఆగస్టులో నిబంధన 18(ఏ) అమల్లోకి వచ్చిందన్నారు. అలాంటి కేంద్రాల వద్ద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ను రిటర్నింగ్‌ అధికారే నియమించారని చెప్పారు. ఫారం-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని వివరించారు. దీంతో..కోర్టు తీర్పు వైపు పార్టీలు ఉత్కంఠగా చూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+