చంద్రబాబు బయటకు వస్తారా - కీలక అప్డేట్..!!
తెలుగుదేశం అధినేత జైలుకు వెళ్లి 48 రోజులు పూర్తయింది. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంలో ప్రస్తుతం క్వాష్ పిటీషన్ పైన తీర్పు వచ్చే నెల 8వ తేదీకి రిజర్వ్ అయింది. ఈ సమయంలోనే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో పిటీషన్ దాఖలైంది. రేపు (శుక్రవారం) ఈ పిటీషన్ పైన విచారణ జరగనుండటంతో..నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.
బెయిల్ పిటీషన్ విచారణ:చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారనేది ఇప్పుడు కీలక చర్చగా మారుతోంది. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు తొలి నుంచి క్వాష్ కోసమే ప్రయత్నం చేసారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ డిస్మిస్ కావటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని..

గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయటం సరి కాదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించార. అయితే, 17ఏ సవరణకు ముందే స్కిల్ కేసు విచారణ ప్రారంభమైందని..చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టు ముందు గత తీర్పులను ప్రస్తావన చేసారు. రెండు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు నవంబర్ 8వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది.
క్వాష్ తీర్పు రిజర్వ్:ఇదే సమయంలో ఫైబర్ కేసులో మధ్యంతర బెయిల్ ను వచ్చే నెల 9వ తేదీన విచారణకు నిర్ణయించింది. ఈ సమయంలోనే స్కిల్ స్కాంలో హైకోర్టులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటీషన్ లపైన వెకేషన్ బెంచ్ రేపు (శుక్రవారం) విచారణ జరపనుంది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా ఈ బెయిల్ పిటీషన్ విచారణ జాబితాలోకి వచ్చింది. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించటంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

కొనసాగుతున్న ఉత్కంఠ:హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంలో క్వాష్ తీర్పు పైన ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో చంద్రబాబు బెయిల్ పైన రాజకీయంగానూ టీడీపీలో చర్చ మొదలైంది.
దీంతో, చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో హైకోర్టు విచారణ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠకు కారణం అవుతోంది.












Click it and Unblock the Notifications