చంద్రబాబు బెయిల్ కేసులో అనూహ్యం - న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ..!!

చంద్రబాబు కేసుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు వెకేషన్ బెంచ్ లో చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభం సమయంలోనే న్యాయమూర్తి ఈ కేసు పైన వాదనలు వినేందుకు విముఖత వ్యక్తం చేసారు. ఈ కేసు నుంచి న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పారు. ఈ కేసు విచారణ మరో బెంచ్ కు పంపేలా రిజిస్టార్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 31వ తేదీకి బెయిల్ విచారణ వాయిదా వేసారు.

నాట్ బిఫోర్ మీ
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో పిటీషన్ దాఖలైంది. ఈ రోజు ఈ పిటీషన్ పైన విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు లిస్టు చేసారు. కేసు విచారణ ప్రారంభం సమయంలోనే న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పారు.

High Court Vacation Judge Refuses to hear Chandra Babu Bail petition in Skill Scam

చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల జాబితాలో కొత్తగా జీవీఎల్ మూర్తి ఉన్నారు. జ్యూడీషియల్ అధికారి కుటుంబ సభ్యుడు కావటంతో తాను ఈ కేసు విచారణ చేయలేనని న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఏ బెంచ్ కు బదిలీ చేస్తారనేది రిజిస్టార్ నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తి స్పష్టం చేసారు.

మధ్యంతర బెయిల్ కోసం
ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

చంద్రబాబుకు వెంటనే కంటికి శస్త్రచికిత్స అవసరం కావటంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్దించారు. దీని పైన ఈ రోజు విచారణకు రాగా..న్యాయమూర్తి విచారణకు విముఖత వ్యక్తం చేయటంతో ఈ కేసు తిరిగి ఈ నెల 31వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాయిదా వేయవద్దని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా.. రిజిస్టార్ ఏ బెంచ్ కు పంపాలో నిర్ణయిస్తారని న్యాయమూర్తి స్పష్టం చేసారు.

High Court Vacation Judge Refuses to hear Chandra Babu Bail petition in Skill Scam

విచారణ వాయిదా
ఈ సమయంలోనే స్కిల్ స్కాంలో హైకోర్టులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటీషన్ లపైన వెకేషన్ బెంచ్ ఈ రోజువిచారణ జరపనుంది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా ఈ బెయిల్ పిటీషన్ విచారణ జాబితాలోకి వచ్చింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసినట్లు తెలుస్తోంది.

సుప్రీంలో క్వాష్ తీర్పు పైన ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది. వాయిదా వేయవద్దని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా.. రిజిస్టార్ ఏ బెంచ్ కు పంపాలో నిర్ణయిస్తారని న్యాయమూర్తి స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+