అమరావతిలో హైడ్రామా..! వేడి పెంచిన ప్రజావేదిక..!!

అమరావతి/హైదరాబాద్ : సహజంగా అదికార, ప్రతిక్ష పార్టీల మద్య రోజూ ఘర్షణ జరగకపోయినా ఘర్షణ పూరిత వాతావరణం మాత్రం ఉంటుంది. కాని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెలకొంది. . ఇప్పుడు అధికారం ఒక‌రి చేతుల్లోంచి మ‌రొక‌రి చేతుల్లోకి మార‌డంతో ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయించుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక సాక్షిగా అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య యుద్దం జ‌రుగుతోంది. ప్ర‌జావేదిక‌ను త‌నకు కేటాయించాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు త‌న‌కు లేఖ రాసిన కొన్ని గంటలకే దాన్ని స్వాధీనం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డం రాజకీయాలను స‌రికొత్త మ‌లుపు తిప్పింది. అంతేకాకుండా అందులోని చంద్ర‌బాబుకు చెందిన వ‌స్తువుల‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డంతో వివాదం మ‌రింత ముదిరింది.

Recommended Video

    ఇలా చేయటం సరికాదు- యనమల
    ప్రజావేదకపై టీడిపి పట్టు..! ససేమిరా అంటున్న వైసీపి..!!

    ప్రజావేదకపై టీడిపి పట్టు..! ససేమిరా అంటున్న వైసీపి..!!

    చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తిలోని ఉండ‌వ‌ల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీని ప‌క్క‌నే చంద్ర‌బాబు ప్ర‌జావేదిక పేరిట మ‌రో భ‌వ‌నాన్ని నిర్మించారు. ఇందులో అధికారిక కార్య‌కలాపాలు, స‌ద‌స్సులు, స‌మీక్ష‌లు, నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల‌కు ఇక్క‌డే చంద్ర‌బాబు అందుబాటులో ఉండేవారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న రోజుల్లో ప్ర‌జావేదిక‌కు సంద‌ర్శ‌కుల తాడికి బాగా ఉండేది. ఆయ‌నకు అధికారం పోయాక ఈ భ‌వ‌నం ఖాళీగా ఉంటోంది. అయితే ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని త‌నకు కేటాయించాల‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు నేరుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు.

    ప్రజా వేదిక వద్ద టీడిపి నేతల హైరానా..! అనవసరపు ఆయాసం ఎందుకన్న వైసీపి నేతలు..!!

    ప్రజా వేదిక వద్ద టీడిపి నేతల హైరానా..! అనవసరపు ఆయాసం ఎందుకన్న వైసీపి నేతలు..!!

    ఈ లేఖ‌పై ప్ర‌భుత్వం నుంచి ఎలాంంటి స్పంద‌న లేదు. ఏదో ఒక రోజు ప్ర‌భుత్వం త‌నకు ఆ భ‌వ‌నం కేటాయిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో చంద్ర‌బాబు ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆ భ‌వ‌నాన్ని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని నిర్ణ‌యించింది. దీంతో చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చిన‌ట్లు అయ్యింది. తాజాగా చంద్ర‌బాబుకు చెందిన వ‌స్తువులు ప్ర‌భుత్వం సిబ్బంది ప్ర‌జావేదిక నుంచి బ‌య‌ట ప‌డేశారు. ఈ నెల 24న ఏపీ ప్ర‌భుత్వం ఇక్క‌డ క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించింది. జ‌గ‌న్ వ‌చ్చాక తొలిసారిగా జ‌ర‌గ‌నున్న స‌ద‌స్సు కావ‌డంతో కీల‌కంగా మారింది. వాస్త‌వానికి ఈ స‌ద‌స్సును స‌చివాల‌యంలోని అయిదో బ్లాకులో నిర్వ‌హించాల‌ని భావించినా.. త‌ర్వాత అనూహ్యంగా ప్ర‌జావేదిక హాలుకు మార్చ‌డం విశేషం.

    ప్రజా వేదిక ఎందుకివ్వాలి..! టీడిపిని సూటిగా ప్రశ్నించిన ప్రభుత్వం..!!

    ప్రజా వేదిక ఎందుకివ్వాలి..! టీడిపిని సూటిగా ప్రశ్నించిన ప్రభుత్వం..!!

    దీంతో చంద్ర‌బాబు ప్ర‌జావేదిక భ‌వ‌నం కావాల‌ని కోరిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా లేద‌ని స���ప‌ష్ట‌మ‌వుతోంది. వాస్త‌వానికి భ‌వ‌నం ఇవ్వ‌క‌పోవ‌డం అటుంచితే చంద్ర‌బాబు వ‌స్తువుల‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డంపై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అందులోని వ‌స్తువుల‌ను తీసుకెళ్లేందుకు మాజీ మేయ‌ర్ అనూరాధ‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్ర‌జావేదిక భ‌వ‌నం వ‌ద్ద‌కు వెళ్లేస‌రికే వ‌స్తువులు బ‌య‌ట‌ప‌డేసి ఉన్నాయి. దీంతో ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డుతున్నారు. ఒక‌వైపు చంద్ర‌బ���బు విదేశాల్లో ఉండ‌గా మ‌రోవైపు ప్ర‌భుత్వం రుబాబు చేస్తోంద‌ని చెబుతున్నారు.

    బాబు లేఖను పట్టించుకోని అదికార పార్టీ..! ప్రజలకోసమే ఏదైనా అంటున్న జగన్..!!

    బాబు లేఖను పట్టించుకోని అదికార పార్టీ..! ప్రజలకోసమే ఏదైనా అంటున్న జగన్..!!

    చంద్ర‌బాబు ఎంతో ప్ర‌త‌ష్ఘాత్మ‌కంగా నిర్మించుకున్న ప్ర‌జావేదిక భ‌వ‌నం ఇక ఆయ‌న‌కు లేన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నారు. ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న ప‌క్షంలో అక్క‌డ స‌మీక్ష‌లు, స‌ద‌���్సులు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తుంద‌ని భావిస్తున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు లేఖ‌కు ఇంకా ఏపీ ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం రాలేదు. ఆయ‌న విజ్ఞ‌ప్తిని కాదంటూ ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ అలాంటిదేమీ లేకుండా భ‌వ‌నం స్వాధీనం చేసుకుని.. ప్ర‌జావేదిక ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పిన‌ట్లు అయ్యింది. ఒక‌వైపు చంద్ర‌బాబు విదేశాల్లో ఉండ‌గా అటు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరగా.. మ‌రోవైపు ప్ర‌జావేదిక భ‌వ‌నం ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+