బాలకృష్ణ నివాసం వద్ద హైటెన్షన్: ఇంటిముట్టడికి యత్నించిన బీజేవైఎం..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించడానికి బీజేవైఎం కార్యర్తలు ప్రయత్నించారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Recommended Video

బాలకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్న కార్యకర్తలు.. ఆయన నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. బీజేవైం కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడిస్తారన్న సంగతి తెలుసుకుని.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కాగా, శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొన్న బాలయ్య.. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ తన భార్యను గౌరవించడం నేర్చుకోవాలని మండిపడ్డారు. ప్రసంగం మధ్యలో కొన్ని బూతులు కూడా దొర్లాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పాలని బాలయ్యను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేవైఎం కార్యకర్తలు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications