గుడివాడలో హై టెన్షన్- చంద్రబాబు టూర్ కు ముందే వైసీపీ, టీడీపీ పరస్పర దాడులు..
కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతలకు కారణమవుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడకు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే రోడ్ షోతో పాటు బహిరంగసభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబు రాకముందే వైసీపీ వర్సెస్ టీడీపీగా అక్కడి పరిస్ధితి మారిపోయింది. రోడ్లపై ఎక్కడ చూసినా పోలీసులు, ప్రత్యేక బలగాలు కనిపిస్తున్నాయి.
గుడివాడలో చంద్రబాబు మరికాసేపట్లో రోడ్ షో, అనంతరం బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చంద్రబాబు రాకను స్వాగతిస్తూ టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి భారీగా చేరుకుని బైక్ ర్యాలీలు తీస్తున్నారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా వారిని ప్రతిఘటించడంతో శరత్ ధియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారికి సర్దిచెప్పి పంపారు.

గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కొంతకాలంగా చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇవాళ వాటికి గట్టి సమాధానం ఇస్తారని తెలుస్తోంది. దీంతో స్ధానికంగా ఉద్రిక్తపరిస్దితులు నెలకొంటున్నాయి. చంద్రబాబు చాలా కాలం తర్వాత పట్టణానికి వస్తుండటంతో టీడీపీ క్యాడర్ కూడా ఈ టూర్ ను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతల నుంచి వారికి ప్రతిఘటన ఎదురవుతోంది.













Click it and Unblock the Notifications