జమ్మలమడుగులో హైటెన్షన్?: వైసీపీ వర్సెస్ టీడీపీ?, అసలేం జరిగింది!
Recommended Video

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆది నారాయణ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలు గ్రామంలో అడుగుపెట్టబోతున్నారన్న విషయం తెలిసి ఆది వర్గీయులు వారి రాకను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సైతం వైసీపీ నేతలకు అడ్డుచెప్పడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం.

అసలేం జరిగింది?:
మంత్రి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడి. ఇదే గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ సంపత్ వివాహం మే 25న జరిగింది. వివాహానికి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర నాయకులను ఆహ్వానించారు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్నందునా పెళ్లికి ఎంపీ హాజరవలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆ దంపతులను కలిసేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డితో కలసి పెద్దదండ్లూరుకు బయలుదేరారు.

ఇంటిపై దాడి?:
ఎంపీ ఆయన అనుచరులు గ్రామంలో అడుగుపెడుతున్నారని తెలియగానే మంత్రి ఆది అనుచరులు అప్రమత్తమైనట్టు సమాచారం. ఆ వెంటనే ఆది తనయుడు సుధీర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పెద్దదండ్లూరు చేరుకున్నట్టు తెలుస్తోంది. తొలుత సంపత్ ఇంటికి వెళ్లిన ఆయన.. పెళ్లి సందర్భంగా ఇంటి ముందు ఏర్పాటు చేసిన షామియానాని ధ్వంసం చేసినట్టు చెబుతున్నారు.

పోలీసులు అడ్డకోవడంతో..:
పోలీసులు సైతం వైసీపీ నేతలను గ్రామంలోకి అనుమతించకపోవడంతో వైసీపీ నేతలు మార్గమధ్యలోనే నిరసనకు దిగారు. ఎంపీ అవినాష్‌రెడ్డి కల్పించుకుని.. తనతోపాటు సురేష్‌బాబు, డాక్టర్ సుధీర్‌రెడ్డి ముగ్గురం మాత్రమే పెద్దదండ్లూరు వెళతామని అనుమతించాలని కోరారు. అయినా పోలీసులు నో చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోందికాగా, అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు, సుధీర్‌రెడ్డిని కడప శివారులోని చింతకొమ్మదిన్నె వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనుకు తరలించినట్టు సమాచారం.

ప్రత్యర్థులతో ఘర్షణ
ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో లాఠీచార్జి కూడా జరిగినట్టు చెబుతున్నారు.ఇక మంత్రి ఆది వర్గీయులు దేవగుడిలో తమ ప్రత్యర్థులైన కుళాయిరెడ్డి, అంజయ్య, అయ్యవారు కుటుంబాలకు చెందినవారితోనూ ఘర్షణకు దిగినట్టు తెలుస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications