హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు: ఆ సాక్ష్యాలున్నాయి.. విచారణ ఎదుర్కోవాల్సిందే!
కలెక్టర్ పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారన్న దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందునా.. పిటిషన్ కొట్టివేసేందుకు నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది.
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంతో జగన్ పై దాఖలైన కేసు పట్ల కోర్టు ప్రతికూలంగా స్పందించింది. కేసును కొట్టివేయాల్సిందిగా జగన్ తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
కలెక్టర్ పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారన్న దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందునా.. పిటిషన్ కొట్టివేసేందుకు నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది. కాగా, గతంలో కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయంలో.. కలెక్టర్ బాబుకు మధ్య నందిగామ ప్రభుత్వాసుపత్రిలో వాగ్వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

నందిగామ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించడానికి జగన్ వెళ్లగా.. పోస్టు మార్టమ్ రిపోర్టుపై కలెక్టర్ తో వాగ్వాదం జరిగింది. 'ఆల్ ది డిపార్ట్ మెంట్స్ ఫ్రం పోలీస్ టు కలెక్టర్ స్టాండ్స్ కరప్ట్. మీరు చేసినవన్నీ కూడా పర్ ఫెక్ట్ గా ఎంక్వయిరీ జరిపిస్తాం.. మిమ్మల్ని కూడా సెంట్రల్ జైలుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేపడుతాం' అంటూ ఆ సమయంలో కలెక్టర్ పట్ల జగన్ ఫైర్ అయ్యారు.
ప్రమాదంలో చనిపోయిన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయకుండా తరలిస్తుండటాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇదే క్రమంలో ఆ మృతదేహానికి సంబంధించిన పేపర్లను డాక్టర్ వద్ద నుంచి లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద ఓ కలెక్టర్ పట్ల, డాక్టర్ పట్ల జగన్ అలా వ్యవహరించడంపై అప్పట్లో అధికార పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఆపై కేసు నమోదవడంతో.. న్యాయపరంగా జగన్ దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications