గర్ల్‌లా వచ్చి, కోరిక తీర్చుకొన్నాడని టెక్కీపై వీరంగం
హైదరాబాద్: యువతిలా ఓ సాఫ్టువేర్ ఇంజనీర్‌ను లిఫ్ట్ అడిగి.. ఆ తర్వాత అతని పైన అభాండాలు మోపిన హిజ్రా ఉదంతం మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఓ టెక్కీ హైటెక్ సిటీలోని ఆఫీసుకి బైక్ పైన వెళ్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కమాన్ వద్దకు రాగానే స్కార్ఫ్ ధరించిన ఓ యువతి లిఫ్ట్ అడిగింది. శ్రీనివాస్ ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు.
బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాగానే ఆమె బైక్ ఆపమని చెప్పింది. అతను బైక్ ఆపగానే తాళం చెవులు తీసుకుని లైంగిక వాంఛ తీర్చుకుని డబ్బులివ్వకుండా మోసం చేశాడంటూ వీరంగం వేసింది. దీంతో షాక్ తిన్న అతను ఆందోళన చెందాడు.

ఏం చేయాలో తోచక... ఆమె చెబుతుందంతా అబద్ధమని తన ద్విచక్రవాహనానికి అడ్డొచ్చి లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నా అంతే తప్ప ఆమెకు తనకు ఏ సంబంధం లేదని వాపోయాడు. విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న స్థానికిలు యువతి ముఖానికి కట్టుకున్న స్కార్ప్ తొలగించారు. అయితే, అప్పటి వరకు ఆమెను అందరు అమ్మాయిగా భావించారు. కాని స్కార్ప్ తీయడంతో ఆమె యువతి కాదని.. హిజ్రా అని తెలిసింది.












Click it and Unblock the Notifications