హిమబిందు రేప్, హత్య: కన్నేసిన సుభానీ, ప్లాన్‌తోనే..

ఆరుగురు కలిసి హిమబిందుపై అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పారు. సుభానీ, గోపీకృష్ణలు హిమబిందు కుటుంబ సభ్యులకు డ్రైవర్లుగా పని చేశారన్నారు. ఆమెపై చాలాకాలంగా సుభాని కన్నేశాడని, గోపీకృష్ణతో కలిసి ప్లాన్ వేశారని చెప్పారు. తామిద్దరం మాత్రమే వెళ్తే ప్రతిఘటన ఎదురవుతుందని భావించారని, దీంతో గోపీకృష్ణ ముగ్గురిని, సుభానీ ఓ వ్యక్తిని వెంట తీసుకు వచ్చారన్నారు.
హత్య చేసిన రోజు నిందితులు అపార్టుమెంటులోని కింది వాళ్లకు నీళ్లు రావడం లేదని, చెక్ చేయడం కోసం వచ్చారని చెప్పారు. వారి మాటలను నమ్మిన హిమబిందు తలుపు తీయడంతో... వారు ఓ ఐదు నిమిషాల పాటు బాత్రూంలో రిపేర్ చేస్తున్నట్లు నటించారన్నారు. ఆమె బెడ్రూంలో పని చేసేందుకు వెళ్లగా.. సుభాని, గోపీకృష్ణలు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారన్నారు. మొదట ముగ్గురు, ఆ తర్వాత ఒకరు బయట కాపలా ఉంటూ ఇంకొకరు.. మొత్తం ఆరుగురు అత్యాచారం చేశారన్నారు.
ఆ తర్వాత గొంతు పిసికి హత్య చేశారని, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారన్నారు. నిందితుల్లో మరొకరిని పట్టుకోవాల్సి ఉందని, అతని కోసం బృందాలను పంపించామన్నారు.
నిందితులను కోర్టులో ప్రవేశ పెడతామన్నారు. కేసును తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. ఆరుగురు నిందితుల్లో సుభానీ, గోపీకృష్ణలతో పాటు జంపాల కృష్ణ, దుర్గారావు, లంకపల్లి రమణలను అరెస్టు చేశామని, మిగతా నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications