రంగంలోకి బాలకృష్ణ: భూమాకు మద్దతుగా నంద్యాలలో ప్రచారం
నంద్యాల:నంద్యాల ఉప ఎన్నికల్లో సినీ తారలు సందడి చేయనున్నారు. సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ నెల 16వ, తేది నుండి నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి తరపున ప్రచారం నిర్వహించనున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తరపున సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులు ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ మాత్రం నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారనే విషయమై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

పవన్ మద్దతు ఎవరికనే విషయమై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నెల 16వ, తేది నుండి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు.
బాలకృష్ణ ప్రచారంతో టిడిపి క్యాడర్‌లో ఉత్సాహం వస్తోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. బాలయ్యను ప్రచారానికి రప్పించాలని ఇప్పటికే పార్టీ నేతలు చంద్రబాబును కోరారు. పార్టీ నేతల కోరిక మేరకు బాలయ్య ఈ నెల 16వ, తేది నుండి ప్రచారాన్ని నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications