హిందూపురంలో బాలయ్యకు షాక్: టీడీపీ కన్వీనర్ పదవికి రంగారెడ్డి రాజీనామా
అమరావతి: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వ్యవహార శైలి మరోసారి తెరమీదకు వచ్చింది. బాలయ్య వ్యక్తిగత కార్యదర్శి తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సుదీర్ఘ కాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చిలమత్తూరు మండల కన్వీనర్ రంగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో బాలయ్యకు తన సొంత నియోజకవర్గంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి రాజీనామాకు వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వ్యవహార శైలే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నియోజకవర్గంలో శేఖర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కరపత్రాల పంపిణీ కూడా జరిగిన సంగతి తెలిసిందే.
దీంతో పాటు ఎలాంటి హోదా లేకపోయినా అధికార, అనధికార కార్యక్రమాల్లో తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వకపోడవం వల్లనే వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తీరును పార్టీలోని అందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications