Gorantla Madhav: హిందూపురం ఎంపీ రాసలీలలు!అనిత ఫైర్:మాధవ్ ఏమన్నారు..?
రాజకీయ నాయకుడంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. ప్రజలకు మంచి చెడ్డ చెబుతూ ఉండాలి. కానీ ఓ నాయకుడు చేసిన పనికి సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది. ఇంతకి అతను ఏం చేశాడు. ఆ నాయకుడు ఎవరో చూద్దాం.

ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు బయటపడ్డాయి. అతను ఓ మహిళతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడారు.ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాను చుట్టేయడంతో మహిళా సంఘాలు గోరంట్ల మాధవ్ పై భగ్గుమన్నాయి. ఇక ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గోరంట్ల మాధవ్‌పై నిప్పులు చెరిగారు.

రాజీనామాకు డిమాండ్..
ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన వీడియో పలు వార్తా ఛానెల్స్‌లో ప్రసారం అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా బుల్లెట్ కంటే వేగంగా దూసుకెళుతోంది. బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంపై మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన ఎంపీ.. మహిళతో ఇలా నగ్నంగా అసభ్యకరంగా మాట్లాడటం పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

స్పందించిన టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. అంతేకాదు ప్రతీ విషయంపై ట్వీట్లు చేస్తూ టీడీపీని భ్రష్టుపట్టించే ప్రయత్నం చేసే విజయసాయిరెడ్డి ఎంపీ మాధవ్ విషయంపై ఎందుకు ట్వీట్లు చేయరంటూ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఒకడు గంట, మరొకడు అరగంట ఇంకొకడు ఏకంగా వీడియోతోనే కాలం గడిపేస్తున్నారంటూ వైసీపీ పై వంగలపూడి అనిత ఘాటు విమర్శలు చేశారు.

నాపై కుట్ర జరుగుతోంది
ఇదిలా ఉంటే ఎంపీ మాధవ్ సర్క్యులేట్ అవుతున్న వీడియోపై స్పందించారు. వీడియోలను మార్ఫింగ్ చేసి తనను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర చేస్తున్నారని చెప్పారు. తాను ఏ విచారణకైనా సిద్ధమంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే, ఈ విషయమై జిల్లా ఎస్పీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరాను. ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిద్ధమేనని చెప్పిన గోరంట్ల మాధవ్... తెలుగు దేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట అనే వ్యక్తులే ఈ కుట్ర చేశారని చెప్పారు. వారిపై పరువునష్టం దావా వేస్తునట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications