హైదరాబాద్ స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచార ముఠా: నిర్వాహకురాలు ముంబై మహిళ
హైదరాబాద్: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
గచ్చిబౌలి సిఐ జె రమేష్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. - ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం (32) అలియాస్ అలిసా బేగం కొన్నేళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటోంది.

ఆమె కొండాపూర్ శ్రీరాంనగర్‌లోని ఓ అపార్టుమెంటులో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తోంది. సైబరాబాద్ ఎస్టీవో పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం రాత్రి ఫ్లాట్‌పై దాడి చేశారు.
ప్రధాన నిందితురాలు సిమ్రాన్‌తో పాటు ఢిల్లీకి చెందిన డింపుల్ (27), అబ్దుల్ సమద్ (42), కరీంనగర్‌కు చెందిన షేక్ యాసిన్ (20), షేక్ మోసిన్ (20), డ్రైవర్లుగా పనిచేసిన ఎండి షకీల్ (23), అబ్దుల్ అజీజ్ (23), విశాఖపట్నం తాళ్లపాలెంకు చెందిన వంట మనిషి సంధ్య (35)లను అరెస్టు చేసి శనివారంనాడు రిమాండ్‌కు తరలించారు.
నిందితుల నుంచి అసెంట్, ఇండికా కార్లు, 20 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ ఖాతాలో రూ.2.50 లక్షలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బ్యాంకులోని డబ్బును కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు. ఫ్లాట్ యజమానికి నోటీస్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అతని వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఫ్లాట్‌ను సీజ్ చేస్తామని అన్నారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications