సోషల్ మీడియాలో ఫోటోలు, ఫోన్ లో బేరం, హెటెక్ వ్యభిచార ముఠా అరెస్టు
శ్రీకాళహస్తి : చేస్తోన్న పనులను మానేశారు.వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించారు. డబ్బులు సంపాదించేందుకు ఇదే మార్గమని భావించారు. ఈ పనిలో పెద్ద ఎత్తున డబ్బులు వస్తుండడంతో కొనసాగించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇల్లు అద్దెకు తీసుకొని హెటెక్ వ్యభిచారం నిర్వహించారు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టుచేశారు.
సామాజిక మాథ్యమాల ద్వారా అమ్మాయిల చిత్రాలతో వ్యభిచారాన్ని నిర్వహించే ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాథ్యమాల ద్వారా విటులకు అమ్మాయిల పోటోలు పంపుతారు,. ఫోన్ ద్వారా ఆ యువతులకు ఏ మేరకు ధర చెల్లించాలి, ఎక్కడికి రావాలనే విషయాన్ని మాట్లాడుకొనేవారు. హెటెక్ పద్దతుల్లో వ్యభిచారం నిర్వహంచే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

శ్రీకాళహాస్తిలోని ఓ లాడ్జీలో ఉదయ్ కుమార్ పనిచేసేవాడు. ఈయనకు నెల్లూరుకు చెందిన మహిళతో పరిచయంఏర్పడింది. ఈ పరిచయం ఆధారంగా వీరిద్దరూ వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించాలని భావించారు. వెంటనే తమ పథకాన్ని అమలు చేశారు.
తమ పనులకు మానుకొన్నారు.శ్రీకాళహాస్తిలోని సబ్ ట్రెజరీ సమీపంలో డూప్లెక్స్ ఇల్లును అద్దెకు తీసుకొన్నారు. ఈ ఇంటిని వ్యభిచార కేంద్రంగా మార్చారు. నెల్లూరు జిల్లా గూడూరు కు చెందిన మల్లిఖార్జునరావు వీరికి విటులను, యువతులను తీసుకొచ్చేవాడు.
అయితే స్థానికులకు ఈ ఇంట్లో ఉండేవారిపై వారు నిర్వహించే కార్యకలాపాల మీద అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఆధారంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఇంటి మీద నిఘా పెట్టారు. ఈ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని అనుమానం వచ్చింది పోలీసులకు. ఈ మేరకు పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. హెటెక్ వ్యభిచార ముఠాను అరెస్టు చేశారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications