పుణ్యక్షేత్ర పరిసరాల్లో హైటెక్ సెక్స్ రాకెట్: యువతులు, నిర్వాహకురాలి అరెస్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతిలో రహస్యంగా సాగిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, చెన్నై, ముంబైల నుంచి కొంతమంది వ్యక్తులు తిరుపతిని కేంద్రంగా.
తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతిలో రహస్యంగా సాగిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు, చెన్నై, ముంబైల నుంచి కొంతమంది వ్యక్తులు తిరుపతిని కేంద్రంగా ఈ వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, నిర్వాహకులను, యువతులను, విటులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఎవరికీ అనుమానం రాకుండా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో అద్దెకు ఇళ్లు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ, పేద యువతులకు మాయమాటలు చెప్పి ఈ రొంపిలోకి దింపుతున్నారు. విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు.

అవిలాలలోని పేపర్స్ కాలనీలో వ్యభిచార ముఠా కార్యకలాపాలు జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా, నిందితుల్లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత కూడా ఉన్నట్లు తెలిసింది. చెన్నైకి చెందిన ఓ మహిళ అవిలాలలో ఇంటిని అద్దెకు తీసుకుని నిరుద్యోగ యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతోందని పోలీసులు తెలిపారు.
చెన్నై, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారితో పరిచయాలను ఏర్పరచుకుని వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పారు. హైవేలపై వాహనాల్లో వెళుతున్న వారిని ఆకర్షించేలా ఆ యువతులను రోడ్లపై నిలబెట్టి.. వాహనాలను ఆపిన వారిని తమ స్థావరాలకు తీసుకెళ్లి పని కానిచ్చేస్తున్నారు. ఇలా నిర్వాహకులు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.
వ్యభిచార కార్యకలాపాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఓ కన్నేసిన పోలీసులు.. నిర్వాహకురాలు సరోజమ్మను, పలువురు యువతులు, విటులను అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పవిత్రస్థలంలో ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తుండటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications