తిరుమలలో హాలిడే రష్ పీక్స్- 26 గంటలకు పైగా: క్యూ కాంప్లెక్స్, గోగర్భం సర్కిల్ వరకూ

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. బుధవారం నాడు 78,723 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 36,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.63 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు క్యూ లైన్ ఏర్పడింది.

టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.48 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 3.04 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,834 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు.

Holiday rush reaching its peak coupled with the ongoing Purattasi month TTD is providing services

ఇదే రద్దీ కొనసాగుతూనే వస్తోంది. పెర‌టాసి మాసంతో పాటు వ‌రుస సెల‌వుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తోన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1,2, నారాయణగిరి షెడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గోగర్భం స‌ర్కిల్ సమీపంలో ఉన్న ఆక్టోపస్ భవనం వరకూ క్యూలైన్ ఏర్పడిందంటే భక్తల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదేే పరిస్థితి సోమ, మంగళవారం వరకూ కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. అన్న ప్రసాదం, ఆరోగ్యం, శ్రీవారి సేవా, విజిలెన్స్ సిబ్బంది క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తోన్నారు. క్యూలైన్లలో ఉంటోన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తోన్నారు. టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో మొబైల్ క్లినిక్ లు అందుబాటులో ఉంటోన్నాయి.

రద్దీ పెరిగిన నేపథ్యంలో శానిటేషన్, భద్రతకు పెద్దపీట వేస్తోంది టీటీడీ. చెత్త పేరుకుపోకుండా నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తోన్నారు. భ‌క్తుల అధిక ర‌ద్దీని దృషిలో ఉంచుకుని ఎక్కువ మంది స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అక్టోబ‌ర్ 1వ తేదిన వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను కూడా టీటీడీ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. 5వ తేదీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+