అఫైర్: భర్తపై ఫిర్యాదుకు వచ్చి, వివాహేతర సంబంధం, ఆత్మహత్య, ఏమైంది?

విజయవాడ: పెళ్ళై పిల్లలున్నా వారిద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధం కారణంగా వారిద్దరూ కూడ ఇంటి నుండి పారిపోయారు. అయితే కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వారిద్దరూ కూడ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే వారిద్దరూ కూడ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.

ఐదు మాసాల క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్ళై పిల్లలున్నా వారిద్దరూ కూడ ఇంటి నుండి పారిపోయారు. అయితే వీరిద్దరి వివాహేతర సంబంధం బయటకు పొక్కడంతో వారు ఇంటి నుండి పారిపోయారు.

అయితే ఈ విషయమై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తిరిగి వచ్చిన వారిద్దరూ కూడ మరునాడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.అయితే ఈ ఘటనతో ఈ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

వివాహేతర సంబంధంతో ఆత్మహత్య

వివాహేతర సంబంధంతో ఆత్మహత్య

విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన శ్యాంప్రసాద్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయనకు అదే ప్రాంతానికి చెందిన సంతోషమ్మతో 13 ఏళ్ళ క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు శ్యాంప్రసాద్‌ దుర్గగుడిపై విధులు నిర్వహిస్తున్నాడు ఓ కేసులో భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహితతో శ్యాంప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కూడ ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారిద్దరూ పారిపోయారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టేషన్‌కు వచ్చిన వారిద్దరూ శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హూంగార్డుతో పరిచయంతో

హూంగార్డుతో పరిచయంతో

విజయవాడ మధురానగర్ సాయిబాబా కాలనీకి చెందిన ఓ వివాహిత టైటరింగ్ చేస్తోంది.ఆమె భర్త కూలీ పనులు చేసేవాడు. అయితే హోంగార్డుతో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. రెండు రోజుల క్రితం వారిద్దరూ కూడ ఇంటి నుండి పారిపోయారు. భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన సమయంలో వివాహితతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి కారణమైంది.

ఆత్మహత్య ఎందుకు చేసుకొన్నారు

ఆత్మహత్య ఎందుకు చేసుకొన్నారు

వివాహిత భర్తతో పాటు హోంగార్డు కుటుంబసభ్యులు కూడ పోలీసులకు వేర్వేరు ఫిర్యాదులు చేశారు.ఈ ఫిర్యాదులు అందుకొన్న పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం రాత్రి పూట వీరిద్దరూ కూడ పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. పెళ్ళైనా ఎందుకు ఈ రకంగా చేశారని పోలీసులు వారిని పోలీసులు ప్రశ్నించారు. కౌన్సిలింగ్ చేసి పంపారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్యాంప్రసాద్ ను పోలీసులు ప్రశ్నించారని సమాచారం. అయితే మరునాడు పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కూడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అవమానాన్ని తట్టుకోలేక చనిపోయారా, ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిద్దరి ఆత్మహత్య ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. మొత్తంగా ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.తమ విషయం బయటకు పొక్కిందనే కారణంగా వారిద్దరూ చనిపోయారా, పోలీసులు మందలించారా, కుటుంబసభ్యులు ఏమైనా అన్నారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+