చంద్రబాబు, పవన్ తో 'షా' మంత్రాంగం - కీలక నిర్ణయం..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయింది. పాలనా పరంగా -రాజకీయంగా ఏడు నెలల పనితీరు పైన సమీక్ష మొదలు అయింది. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమరావతికి వస్తున్నారు. సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ కు హాజరు కానున్నారు. పవన్ తో పాటుగా కూటమి ముఖ్య నేతల తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రేపు (శనివారం) ఏపీకి వస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8.30కి విజయవాడ విమానాశ్రయంలో దిగుతారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి 9 గంటలకు చేరుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కూటమి ముఖ్య నేతలతో కలిసి భోజనం చేస్తారు. కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం , ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. రాత్రి 10.30కు విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు.

Home Minister Amith Shah Schedule finalised for Amaravati tour to meet with NDA leaders in his visit

ఆదివారం 19వ తేదీ ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశమవుతారు. 11.30కు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) సౌత్‌ క్యాంప్‌సను ప్రారంభిస్తారు. అక్కడ జరిగే సమావేశంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర హోం మంత్రి అనిత తో పాటుగా ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు. విభజన చట్టం ప్రకారం ఎన్‌ఐడీఎం ప్రాంగణానికి విజయవాడ సమీపంలో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక, అమిత్ షా పర్యటన వేళ రాజకీయంగానూ కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

ఏపీలో ఈ నెల 8న ప్రధాని పర్యటన జరిగింది. ఆ సమయంలో భారీ రోడ్ షో.. బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా కు సీఎం చంద్రబాబు తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేసారు. పవన్ తో పాటుగా కూటమి ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయంతో పాటుగా.. ఏపీకి అందాల్సిన అంశాల పైన చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా కూటమి భవిష్యత్ ప్రణాళిక లు.. ఉమ్మడి కార్యాచరణ పైన ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+