లేడీస్ హాస్టల్లో 5గురు బీహార్ యువతులపై రేప్‌యత్నం

హైదరాబాదులోని వనస్థలిపురంలోని ఓ హాస్టల్లో బీహార్‌కు చెందిన ఐదుగురు యువతులు ఉంటున్నారు. హాస్టల్లో ఉంటున్న మిగతా వారు సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లారు. బీహార్ యువతులు ఐదుగురు మాత్రమే హాస్టల్లో ఉండిపోయారు.
దీంతో హాస్టల్ నిర్వాహకుడు తన స్నేహితులతో కలిసి వారిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. వారు మద్యం మత్తులో తమపై అత్యాచార యత్నం చేశారని, అసభ్యంగా ప్రవర్తించాలని బాధిత యువతులు బుధవారం ఉదయం వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.
ప్రియుడి కుటుంబంపై దాడికి సంబంధించి కేసు
వనస్థలిపురంలో ప్రేమ వ్యవహారంలో ప్రియుడి కుటుంబంపై ప్రియురాలి కుటుంబ సభ్యులు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రియుడి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి దిగిన ప్రియురాలి తండ్రి, సోదరుడు, బావ, మరదలిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications