హైదరాబాద్ మరవకముందే.. కడపలో కూలిన హోటల్ భవనం
ఏపీలోని కడప జిల్లాలో మరో భవనం కూలిపోయింది. కడపలోని ఏడు కూడలిల ప్రాంతంలోని ఓ హోటల్ భవనం వంట గది కూలింది.
కడప: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని నానక్‌రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మరవకముందే ఏపీలోని కడప జిల్లాలో మరో భవనం కూలిపోయింది. కడపలోని ఏడు కూడలిల ప్రాంతంలోని ఓ హోటల్ భవనం వంట గది కూలింది.

స్థానిక సుజాత హోటల్ వంట గతి పై కప్పు శుక్రవారం మధ్యాహ్నం కూలింది. ఆ సమయంలో వంట గదిలో పని చేస్తున్న మహిళలు ప్రమాదంలో చిక్కుకున్నారు. పోలీసులు, స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంది. ఇద్దరు మహిళలను వెలికి తీశారు. మరో మహిళ కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications