రాత్రికి తనతో గడపాలని!: మహిళా ఉద్యోగిని చీర పట్టి లాగి, ఇలా బుక్కయ్యాడు..
రాత్రికి తనతో గడపాలంటూ ఆమెను వేధింపులకు గురిచేయడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని ఓ హోటల్ ఉద్యోగినిపై సీనియర్ ఉద్యోగి సాగించిన వేధింపుల పర్వం సీసీటీవి ఫుటేజీ ద్వారా వెలుగుచూసింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బాధితురాలు(33) విధులు నిర్వహిస్తోంది. జులై 29న ఆమె పుట్టిన రోజు నాడు సీనియర్ ఉద్యోగి ఆమెను తన కేబిన్‌కు పిలిచాడు. క్రెడిట్ కార్డు బయటకు తీసి 'ఏం కావాలో కొనుక్కో.. నా పక్కన వచ్చి కూర్చో' అంటూ అసభ్యంగా మాట్లాడాడు.

పక్కన కూర్చోవడానికి మహిళ నిరాకరించడంతో ఆమె చీర కొంగు పట్టుకుని లాగాడు. అదే సమయంలో పక్కన ఉన్న ఇతర ఉద్యోగులను బయటకు వెళ్లాలని ఆదేశించాడు. రాత్రికి తనతో పాటు గడపాలని మహిళను వేధించాడు. మరునాడు విషయాన్ని ఆమె మానవ హక్కుల విభాగం దృష్టికి తీసుకెళ్లగా వారి నుంచి ఎలాంటి యాక్షన్ లేదు.
చివరకు భర్త సహాయంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. సీనియర్ ఉద్యోగి వేధింపుల దృశ్యాలన్ని సీసీటీవి కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియడంతో హోటల్ యాజమాన్యం ఆమెను విధుల తొలగించారు. సీసీటీవి ఫుటేజీ ను ఆమెకు అందించిన మరో సహోద్యోగిని కూడా ఉద్యోగం నుంచి తీసేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications