బోగీలో చైన్ లాగితే ఎక్కడో ఉండే డ్రైవర్ కు ఎలా తెలుస్తుంది?
బండి ఆగక తప్పదు అన్న పరిస్థితుల్లోనే చైన్ లాగాలి. దీనికి సంబంధించి భారతీయ రైల్వే పలు నియమ నిబంధనలను రూపొందించింది.
భారతీయులకు, భారతీయ రైల్వేకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. అంతగా రైలుబండి వారి జీవితాల్లో పెనవేసుకుపోయింది. తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం సౌకర్యవంతంగా తీసుకువెళ్లడమే కాదు.. కిటికీ పక్కన కూర్చుంటే సమస్త ప్రపంచాన్ని చూపించే రైలు బండి అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు. అలాగే రైలు వేగాన్ని నాచ్ ద్వారా పెంచుతారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతి బోగీలో ఉండే చైన్ గురించి తెలుసుకుందాం.
కూ.. ఛుక్ ఛుక్... అంటూ పట్టాల వెంబడి దూసుకుపోయే రైలు బండి ఆగాలంటే స్టేషన్ వచ్చిన తర్వాత లోకో పైలట్ బ్రేకులు వేసి ఆపుతారు. అలా కాకుండా అత్యవసర సమయాల్లో లాగడానికి ప్రతి బోగీలో చైన్ ఏర్పాటు చేస్తారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే దీన్ని ఏర్పాటు చేసింది. అయితే బండి ఆగక తప్పదు అన్న పరిస్థితుల్లోనే చైన్ లాగాలి. దీనికి సంబంధించి భారతీయ రైల్వే పలు నియమ నిబంధనలను రూపొందించింది. వీటిని అతిక్రమిస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. చైన్ లాగే విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులను నిత్యం రైల్వే అధికారులు మహెచ్చరిస్తూనే ఉంటారు. ఏ బోగీలో చైన్ లాగినా ఎక్కడో దూరంగా ముందుండే పైలట్ కు ఎలా తెలుస్తుందనే సందేహం అందరికీ వస్తుంది. ఇప్పుడు దాన్ని గురించి తెలుసుకుందాం.

చైన్ వ్యవస్థకు అనుసంధానంగా ప్రతి బోగీలో ఎమర్జెన్సీ ఫ్లాషర్(లైట్) ఉంటుంది. ఏ బోగీలో చైన్ లాగినా అక్కడ ఉండే ఫ్లాషర్ వెలుగుతుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రైలును ఆపుతారు. లోకో పైలట్ తోపాటు గార్డ్ కూడా వెంటనే ఏ బోగీలో అయితే చైన్ లాగారో అక్కడికి చేరుకుంటారు. చైన్ ను సరిచేస్తేనే ప్లాషర్ ఆగిపోతుంది. చైన్ వ్యవస్థను తయారుచేయడమే అలా చేశారు. వికలాంగులు, వృద్ధులు రైలు ఎక్కే సందర్భాల్లో, మెడికల్ ఎమర్జెన్సీ, అగ్నిప్రమాదం జరగడంలాంటి సందర్భాలు ఎదురవడం, లేదంటే దోపిడీ దొంగలబారిన పడటం వంటి భద్రతాపరమైన సమస్యలు ఎదురైనప్పుడే చైన్ లాగాల్సి ఉంటుంది.













Click it and Unblock the Notifications