'తల్లికి వందనం' డబ్బులు పడ్డాయా, ఇలా చెక్ చేసుకోండి - వారికి జమ అప్పుడే..!!
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అమలు ప్రతిష్టాత్మకం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ ఈ పథకం అమలుకు నిర్ణయించింది. లబ్దిదారుల ఎంపికతో పాటుగా నగదు విడుదల చేసింది. అయితే, నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతు న్నారు. లబ్దిదారులు తమ ఖాతాల్లో ఇంకా నగదు జమ కాకపోవటంతో వేచి చూస్తున్నారు. అర్హుల జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న వారి డేటా అందిన తరువాత జూలై తొలి వారంలో వారికి నగదు జమ చేయనున్నారు.
నిధుల విడుదల
తల్లికి వందనం నిధులను బ్యాంకుకు జమ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమలు తేదీ రోజునే బ్యాంకులకు ప్రభుత్వం అవసరమైన నిధులను జమ చేసింది. బ్యాంకులకు అందిన లబ్దిదారుల జాబితాకు అనుగుణంగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. గురువారం అర్ద్రరాత్రి నుంచి ఈ నగదు జమ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటికీ నగదు అందని తల్లులు మాత్రం అసలు జాబితాలో తమ పేరు ఉండా లేదా అనే టెన్షన్ తో కనిపిస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని 67 లక్షల మందికి అమలు చేస్తున్నారు. ఇందు కోసం రూ 10,091 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రతీ విద్యార్ధికి సంబంధించి తల్లుల ఖాతాల్లో రూ 13 వేలు చొప్పున జమ చేస్తున్నారు.

ఎలా తెలుసుకోవాలి
పాఠశాలల నిర్వహణ కోసం రూ 2 వేలు మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి... వారి తల్లుల అకౌంట్‌లోకి డబ్బులు వేస్తున్నట్లు స్పష్టం చేసారు. అయితే, ఇంకా తమ ఖాతాల్లో నగదు జమ కాని తల్లుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా లను అందుబాటులో ఉంచారు. అదే విధంగా న్‌లైన్ ద్వారా, వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇందు కోసం అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP లో స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి. కావాల్సిన సమాచారం ఇవ్వటం ద్వారా స్టేటస్ తెలుస్తుంది
సచివాలయాల్లో జాబితా
దీంతో పాటుగా వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009 నంబర్‌కు ''Hi'' అని మెసేజ్ చేయాలి. అందులో సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి... డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి. ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి...స్టేటస్ తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇక.. లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు కార్యాలయాల్లో అందు బాటులో ఉంచుతున్నారు. ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఉండి... తల్లికి వందనం అందక పోతే అదికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని కరెక్ట్ చేసి, అలాంటి వారికి కూడా సాయం అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్‌లు పూర్తయ్యాక వారి తల్లుల అకౌంట్లలోకి జూలై 5న నగదు జమ కానుంది.
-
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు- రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వీరికే...!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications