మీ స్మార్ట్ ఫోన్ నీళ్లల్లో పడిందా?
స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. పక్కన మనుషులు లేకపోయినా ఉంటున్నారుకానీ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారంటే ఎటువంటి అతిశయోక్తి కాదు. చాలామంది ఫోన్లు అనేకసార్లు ప్రమాదవశాత్తూ నీళ్లల్లో పడిపోతుంటాయి. లేదంటే వర్షంలో తడిచిపోతుంటాయి. ఇలా జరిగిన వెంటనే ఫోన్ ను ఆరబెట్టడానికి ప్రయత్నిస్తూ ఈ క్రమంలో అనేక పొరపాట్లు చేస్తుంటారు. ఫోన్ నీళ్లల్లో పడిపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
వెంటనే డివైజ్ ను ఆపేయాలి: ఫోన్ నీళ్లల్లో పడిపోయిన వెంటనే డివైజ్ ను ఆపేయాలి. ఫోన్ లోపలికి నీరు చేరిన తర్వాత ఫోన్ ను ఆన్ లో ఉంచిత మరింత నష్టం జరుగుతుంది. ఆ నీటిని బయటకు పంపించేందుకు ఎక్కువగా షేక్ చేయకూడదు. ఇలా చేయడంవల్ల ఫోన్ లోపల ఉండే నీరు ఫోన్ లోపలి భాగాల్లోకి చేరే ప్రమాదం ఉంది. ఫోన్ లోపల నీరు ఆరిపోవాలని కొందరు హెయిర్ డ్రయ్యర్‌ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల కూడా ఎక్కువగా నీరు చేరుతుంది. ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి.

ఫోన్ వాడకూడదు: ఫోన్ నీళ్లల్లో పడిన వెంటనే పొడి బట్టతో తుడవాలి. అనంతరం 12 గంటలసేపు ఫోన్ ను వాడకూడదు. కనీసం 6 గంటల సమయం బియ్యం ఉండే డబ్బాలో పెట్టాలి. దీనివల్ల ఫోన్ వేగంగా పొడారుతుంది. ఇలా చేసే క్రమంలో బియ్యపు గింజలు హెడ్ ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్టులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఫోన్ లో ఉండే సిమ్ కార్డు ట్రేలను తీసేయాలి. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆన్ చేయాలి. ఆరిన తర్వాత కూడా లోపల తేమ ఉండే అవకాశం ఉంటుంది. గతంలోలా పనిచేయకపోతుంటే దగ్గరలోని సర్వీస్ సెంటర్ లో చూపించాలి.












Click it and Unblock the Notifications