రేషన్, పాన్, ఓటర్ కార్డు పోయిందా?: మళ్లీ పొందడం ఎలాగా?
హైదరాబాద్: మనిషికి గుర్తింపు కార్డు ఎంతో అవసరం. ప్రస్తుతం మానవుడు తన గుర్తింపుని చాటుకొనేందుకు గాను డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఏటీఎం, ఆధార్ కార్డు లాంటి వాటిని సృష్టించాడు. ఆయా గుర్తింపు కార్డులు గనుక లేకపోతే అతడు ఏ పనీ చేయలేడు.
మానవుని జీవితంలో ఈ గుర్తింపు కార్డులు ఎంతో విలువైన భూమికను పోషిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అదే విధంగా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి.
ఇలా మనిషి చేసే ప్రతి పనిలో ఈ ఐడెంటిటీ అనేది ముఖ్య భూమిక పోషిస్తోంది. అలాంటి విలువైన గుర్తింపు పత్రాలను మళ్లీ పొందడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏటీఎం కార్డు :
బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే ఏటీఎం కార్డు తప్పనిసరి. అలాంటి ఏటీఎం కార్డును పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా ముందు సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. అంతేకాదు ఏటీఎం కార్డుని వెంటనే బ్లాక్ చేయంచాలి. లేదంటే మీ ఖాతాలొని సొమ్ముని ఎవరైనా తస్కరించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనజర్ ఈ విషయాన్ని నిర్ధారించుకుని కొత్త ఏటీఎం కార్డుని జారీ చేస్తారు.
పాన్ కార్డు :
పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్) కార్డు పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్ కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొత్త కార్డుకోసం అదనంగా రూ. 90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు. మరింత సమాచారం కోసం https://nsdl.co.in/ వెబ్‌సైట్‌ని సంప్రదించండి.
ఓటరు గుర్తింపు కార్డు :
ఓటరు గుర్తింపు కార్డు పోతే పోలింగ్‌బూత్, కార్డు నెంబర్‌తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రాల్లో మళ్లీ ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చు. లేదా కార్డు నెంబర్ గుర్తుంటే, దాని ఆధారంగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా ఇస్తారు. మరింత సమాచారం కోసం http://eci.nic.in/eci/eci.html వెబ్‌సైట్‌ని సంప్రదించండి.
డ్రైవింగ్ లైసెన్స్ :
డ్రైవింగ్ లైసెన్స్ పోతే వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీస్ స్టేషన్ నుంచి నాన్ థ్రెస్ట్ పత్రంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీవో కార్యాలయంలో అందజేయాలి. నెల రోజుల్లో తిరిగి కార్డును అందిస్తారు. ఎల్ఎల్‌డీ ఫారాన్ని http://www.tn.gov.in/sta/formlld.pdf డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
రేషన్ కార్డు :
రేషన్ కార్డు పోయినా లేదా రేషన్ కార్డు కనిపించకున్నా http://epdsap.ap.gov.in/epdsAP/epds వెబ్‌సైట్ లోకి లాగిన్ కావాలి. ఈ వెబ్‌సైట్‌లో జిరాక్స్ కాఫీని పొందవచ్చు. లేదంటే ఆన్‌లైన్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకుంటే తహాసీల్దార్ పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నెంబర్‌పై కార్డు జారీ చేస్తారు.
పాస్‌పోర్టు కార్టు :
పాస్ పోర్టు పోయినట్లైతే ముందుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసు శాఖ ఇచ్చే నాన్ థ్రెస్ట్ పత్రంతో పాటు పాస్‌పోర్టు కార్యాలయంలో హైదరాబాద్ పేరిట రూ. 1000 డీడీ తీయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. ఆ తర్వాత మూడు నెలలకు డూప్లికేట్ పాస్‌పోర్టు జారీ చేస్తారు.












Click it and Unblock the Notifications