రూ.300 పెట్టుబడితో రూ.1.04 కోట్లు!

మనలో ప్రతి ఒక్కరికీ కోటీశ్వరులు కావాలనే తపన ఉంటుంది. అందుకోసం లాటరీ టికెట్లు కూడా కొంటుంటారు. అయినప్పటికీ లక్ష్మీదేవి వరించక ఎంతోమంది నిరుత్సాహానికి గురవుతారు. కానీ చిన్నవయసు నుంచే కొంచెం కొంచెం మదుపు చేసుకుంటూ వస్తే కోటీశ్వరులవడం ఖాయం. కానీ ఎవరూ అటువైపు దృష్టిసారించరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. అయితే వేలకు వేలరూపాయలు పొదుపు చేయకుండానే మనం కాఫీ తాగిన, టీ తాగిన సొమ్ముతోనే కోటీశ్వరులవ్వొచ్చు.

డబ్బు పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటే మంచి పెట్టుబడి పథకం ఎంచుకోవాలి. దీర్ఘకాలం పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందడానికి సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఎంతో ప్రయోజనకారి. సిప్ ద్వారా ఎంత ఎక్కువకాలం డబ్బు పొదుపు చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సిప్ ద్వారా మంచి రిటర్న్స్ సాధించడానికి మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలి. ప్రతి నెలా ఎక్కువకాలం పొదుపు చేస్తే ఊహించని రిటర్న్స్ మన సొంతమవుతాయి. ఉదాహరణకు నెలకు రూ.300 చొప్పున మ్యూచువల్ ఫండ్‌లో పొదుపు చేసి కోటి రూపాయల రిటర్న్స్ పొందొచ్చు. ఇది ఎలా సాధ్యమో పరిశీలిద్దాం.

How To Get Millionaire.. sip is the best

మ్యూచువల్ ఫండ్స్‌లో 15 శాతం వార్షిక రిటర్న్స్ వస్తే వాటిని మంచి మ్యూచువల్ ఫండ్‌గా చెబుతుంటారు. అంతకంటే ఎక్కువ ఇచ్చేవి కూడా ఉన్నాయి. కొన్ని ఫండ్స్ చరిత్ర చూస్తే 20 శాతం పైనే రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకొని పెట్టుబడి పెడితేనే అలాంటి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకోవడంలోనే అంతా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకోవడానికి అవసరమైన పరిజ్ఞానం లేకపోతే అడ్వైజర్ సలహా తీసుకోవడం ఉత్తమం. .

ఉదాహరణకు 18 శాతం రిటర్న్స్ ఇచ్చే ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఎంచుకుందాం. నెలకు రూ.300 చొప్పున 35 సంవత్సరాలపాటు పెట్టుబడి పెడితే మీకు వచ్చే రిటర్న్స్ కోటి రూపాయల పైనే ఉంటాయి. 35 ఏళ్లల్లో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం కేవలం రూ.1,26,000 కాగా మీకు రూ.1,04,00,000 లాభాలు వస్తాయి. అన్నింటిలో ఇలాంటివి సాధ్యం కాకపోవచ్చు. అది మార్కెట్ ను బట్టి ఆధారపడివుంటుంది. బాగా పాపులరైన ఫండ్స్‌లో ఇలాంటి రిటర్న్స్ అసాధ్యం ఏమీ కాదు. మ్యూచువల్ ఫండ్‌లో యావరేజ్‌గా 15 శాతం రిటర్న్స్ వస్తాయని నిపుణులు చెబుతంటారు. నెలకు రూ.700 చొప్పున 35 ఏళ్లు పెట్టుబడి పెడితే మీరు కోటీశ్వరులవుతారు. 15 శాతం రిటర్న్స్ ప్రకారం లెక్కిస్తే మీరు పెట్టుబడి పెట్టిన రూ.2,94,000 మొత్తానికి రూ.1,04,00,000 రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+