ఏపీలో ఓటర్ల జాబితాలో పేరును ఎలా నమోదు చేసుకోవాలి?

AP elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఇంకో రెండు నెలల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ స్థానాలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. సార్వత్రిక పోరు నిర్వహణపై ఇప్పటికే కేంద్ర కమిషన్ కసరత్తు చేపట్టింది కూడా.

ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికార యంత్రాంగంతో సమావేశాలను నిర్వహించారు. మరో విడతగా సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్.. ఏపీకి రానున్నారు.

How to register your name in voter list of Andhra Pradesh, deets inside

ఈ పరిస్థితుల మధ్య- ఏపీలో కొత్త ఓట్ల నమోదుపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఏపీలో ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేయించుకోవాలనుకునే వారు మొదట https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. కొత్త ఓటర్ల కోసం కేటాయించిన ఆప్షన్లపై క్లిక్ చేయాలి. రిజిస్టర్ ఫోన్ నంబర్‌ను అందులో పొందుపర్చాలి.

ఫామ్ 6ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దాన్ని భర్తీ చేసిన అనంతరం సంబంధిత అధికారులకు అందజేయాలి లేదా ఇదే వెబ్‌సైట్/యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఇంటి అడ్రస్, వయస్సును నిర్ధారించే ధృవపత్రాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. రెండు వారాల తరువాత రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు సమాచారం అందుతుంది. ఈసీ వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+