విశాఖలో లీటర్ పాల ధర 60! బాబు ఇలా.. (పిక్చర్స్)
విశాఖపట్నం: రెండు రోజులుగా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని క్షణాలు నెట్టుకొచ్చిన విశాఖ ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకువస్తున్నారు. తుపాను బీభత్సానికి తమ ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు చెబుతున్నారు. కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ, విద్యుత్ రంగాలకు తీరని నష్టం జరగింది. మంచినీళ్లు కూడా ఎక్కడా దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు.
పరిస్థితి తీవ్రంగా ఉండడంతో నిత్యావసర సరకులు లభించక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పాల ధర రూ.50 నుండి రూ.60 వరకు ఉండగా, పెట్రోలు ధర రూ.100కు పైగా ఉంది. హుధుద్ ధాటికి 500 ఎకరాల్లో తమలపాకుల పంటకు నష్టం జరిగింది. విశాఖలో సోమవారం బస్సులను పునరుద్ధరించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో సమీక్షిస్తున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు.
తుఫాను బాధితులకు చంద్రబాబు తక్షణ సాయం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రానికి బాధితుల కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చక్కరె, 5 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, పశువులు మృతి చెందితే రూ.25వేలు, మత్స్యకారులకు వలకు రూ.5వేలు, పడవ నష్టపోతే రూ.10వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.

హుధుద్
అందుబాటులో ఉన్న కొద్దిపాటి పాల ప్యాకెట్లను దాదాపు 60-70 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయినా అవి చాలా పరిమితంగా ఉండడంతో పాల ప్యాకెట్లు అందనివారు నిరుత్సాహపడుతున్నారు.

హుధుద్
తుపాను బీభత్సానికి విశాఖలో పడవలు మునిగిపోయాయి. నగరంలో కొన్ని కార్ల షో రూమ్‌నుంచి కార్లు క్రింద పడిపోయాయి. రహదారులపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ముందుగా తీయవలసి ఉంది.

హుధుద్
తుపాను బీభత్సానికి విశాఖలో పడవలు మునిగిపోయాయి. నగరంలో కొన్ని కార్ల షో రూమ్‌నుంచి కార్లు క్రింద పడిపోయాయి. రహదారులపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ముందుగా తీయవలసి ఉంది. ఆ తర్వాతే మిగిలిన సహాయ కార్యక్రమాలను అమలు చేయడం సాథ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.

హుధుద్
తుపాను బీభత్సంవల్ల రైలు మార్గం కూడా బాగా దెబ్బ తినడంతో 38 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. హౌరా నుంచి విశాఖ వైపు వచ్చే రైళ్లను, హౌరా వైపు వెళ్లే రైళ్లనూ దాదాపు 30 వరకూ మార్గాన్ని దారి మళ్లించారు.

హుధుద్
యలమంచిలి, రేగుపాలెం వంటి ప్రాంతాలలో రైలు మార్గాలు బాగా దెబ్బ తిన్నాయి. సామర్లకోట, తుని మొదలైన ప్రాంతాలలో రైల్వే శాఖ ఇప్పటికే కొన్ని ఖాళీ బోగీలను ఏర్పాటు చేయడంతో బాధితులు అక్కడే తలదాచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications