జగన్ పిలుపు: హైద్రాబాద్-విశాఖ దారి బంద్(పిక్చర్స్)
హైదరాబాద్/విశాఖ: హుధుద్ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం ఆయన హైదరాబాదులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హుధుద్ తుఫాను తీవ్రత పైన ఆందోళన వ్యక్తం చేశారు.
తుఫాన్ నష్టాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించాలని అంతకుముందు విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లోని పరిస్థితుల పైన స్థానిక నేతలతో వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సంప్రదించారు. కాగా, హుధుద్ కారణంగా పంటలు బాగా దెబ్బతిన్నాయి.

హుధుద్
హుధుద్ తుపాను నేపథ్యంలో ఆది, సోమ వారాల్లో హైదరాబాద్ - విశాఖల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

హుధుద్
హుధుద్ తుపాను కారణంగా 200 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలోనే రైళ్ల రాకపోకలను నిలిపివేశామని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం నాటి పరిస్థితిని పరిశీలించి రైళ్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

హుధుద్
హుధుద్ తుఫాను నేపథ్యంలో విశాఖలో సమాచార వ్యవస్థ దెబ్బతింది. హోర్డింగ్‌లు, భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. అపార్టుమెంట్లకు బీటలు వారాయి. సహాయ చర్యల కోసం మందులు, నీరు, ఆహారం సిద్ధంగా ఉంచారు.

హుధుద్
ఆదివారం మధ్యాహ్నం పెనుగాలులు రావడంతో విశాఖ వాసులు వణికిపోయారు. హుధుద్ నేపథ్యంలో ఇప్పటికే నగరంలో తీవ్ర విధ్వంసం చేసుకుంది.

హుధుద్
మళ్ళీ వీస్తున్న ప్రచండ గాలుల ధాటికి ఏం జరగనుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అక్కడ 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనికితోడు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది! అటు జగదాంబ సెంటర్లో వస్త్ర దుకాణాలు కూలిపోయాయి.

హుధుద్
హుదూద్ తుపాను విశాఖపై విరుచుకుపడింది. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, హోర్డింగ్ లు విరిగి పడడంతో భారీ సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి.

హుధుద్
అపార్టుమెంట్ల గోడలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తుండడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రాణనష్ట నివారణ నిమిత్తం శనివారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

హుధుద్
టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. అటు, సెల్ ఫోన్ సిగ్నళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేవీ కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం దెబ్బతిన్నది.












Click it and Unblock the Notifications